Naga Chaitanya : యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తాజాగా తనను చూసేందుకు ఓ అభిమాని ఏకంగా గోదావరి నదిలోకి దూకేశాడు.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది..
నాగచైతన్య హీరోగా విక్రమ్ కె సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం థాంక్యూ.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఈస్ట్ గోదావరి లో షూటింగ్ జరుగుతుంది. చైతన్య వచ్చాడని తెలుసుకున్న అక్కినేని అభిమానులు ఆ ప్రాంతంలో సందడి చేస్తున్నారు. తన అభిమాన హీరో ని కలిసి మాట్లాడేందుకు , ఫోటోలు తీసుకునేందుకు పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్ కి చేరుకున్నారు.. తాజాగా ఓ వీరాభిమాని వాటర్ లో షూటింగ్ జరుగుతుండగా నాగ చైతన్య ని చూడడం కోసం నదిలోకి దూకేశాడు. చైతు ఉన్న బోటుకు అతి సమీపంలో అభిమాని దూకి అక్కడి నుండి వెంటనే ఈదుకుంటూ వెళ్ళిపోయాడు.
షూటింగ్ పేకప్ చెప్పిన తర్వాత చైతు అతడిని పిలిపించి ఫోటో దిగి మళ్ళీ ఇలాంటి సాహసాలు చేయవద్దు అంటూ.. సున్నితంగా వార్నింగ్ ఇచ్చాడు. కొద్ది సమయం అతడి తో మాట్లాడి పంపించేశాడు. తన అభిమాన హీరో ని కలిసే అవకాశం వచ్చినందుకు ఎంతో పొంగిపోయాడు. చైతు కోసం అభిమాని నీళ్లలో దూకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోదావరి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో చాలామంది నాగచైతన్య ను చూసేందుకు తరలి వచ్చారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం లో నటించిన లవ్ స్టోరీ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Neekuna fanism ki avadhulu levu Anna @chay_akkineni ❤️?
Ne cult fanism level veru anthe ??#ThankYouTheMovie#LoveStoryOnApril16th pic.twitter.com/ImJjKZ4HOj
— Aarya Prasad (@Aaryaprasad) March 2, 2021
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!