Naga Chaitanya: వామ్మో, చైతూ మామూలోడు కాదు.. కాలేజీ రోజుల్లోనే ప్రేమాయణం నడిపాడుగా..

Share

Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తరువాత ఒంటరి పక్షిగా మిగిలాడు. ఫ్యాన్స్ కూడా సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత చైతూని చూసి అయ్యో పాపం అని సానుభూతి చూపిస్తున్నారు. కానీ చైతూ మరీ డిప్రెషన్‌లో ఏం లేడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం చైతన్య నటి శోభితా ధూళిపాళ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇక ఇదే వార్త మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ చక్కర్లు కొడుతోంది.

Naga Chaitanya: కాలేజీలోనే ప్రేమ వ్యవహారం

ఈ క్రమంలోనే నాగచైతన్య తన ‘థాంక్యూ’ సినిమా ప్రొమోషన్స్‌లో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా హైదరాబాద్ లోని మల్లారెడ్డి కాలేజీ వేదికగా ఈ మూవీలోని ఫేర్ వెల్ పాటను రిలీజ్ చేశారు. ఇదే కాలేజీలో నాగచైతన్య మాట్లాడుతూ… తన కాలేజీ రోజుల్లో ఎప్పుడెప్పుడు కాలేజీ అయిపోతుందా?? ఎప్పుడెప్పుడు కెరీర్ స్టార్ట్ చేస్తానా?? ఎప్పుడు తన ప్రేమ విషయం ఇంట్లో చెప్తానా?? అంటూ ఎదురు చూస్తూ ఉండేవాడిని అని నోరు జారాడు. దాంతో నాగచైతన్య కాలేజీలోనే ప్రేమలో పడ్డాడని తన అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. వామ్మో, చైతూ మామూలోడు కాదు.. కాలేజీ రోజుల్లోనే ప్రేమాయణం నడిపాడుగా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. కాలేజీ రోజుల్లో చైతూ ఎవరిని ప్రేమించాడు? ఇంట్లో చెప్పడానికి కూడా రెడీ అయ్యాడంటే ఎంత గాఢంగా ఆమెను లవ్ చేశాడో? అని ఇంకొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

థాంక్యూ సినిమాపై హై ఎక్స్‌పక్టేషన్స్

ఈ వ్యాఖ్యలపై నాగ చైతన్య స్పందించకపోవడంతో అభిమానులు క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించగా, మాళవిక నాయర్, అవికా గోర్, సాయి సుశాంత్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని జూలై 22న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ రిలీజ్ కోసం అక్కినేని అభిమానులు చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా యువతను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

 


Share

Recent Posts

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

41 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

44 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించే డ్రింక్స్..!

ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…

2 గంటలు ago

“SSMB 28” ఆలస్యం కావడానికి కారణం అదేనట..??

"SSMB 28" వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది…

3 గంటలు ago