Naga chaithanya: ఎప్పుడో రావాల్సిన బంగార్రాజు..ఎట్టకేలకి ఇప్పుడు రాబోతోంది. 2019లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఎంతపెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. నాగార్జునకు తగ్గట్టుగా కథ కథనాలు ఉండటం, చాలాకాలం తర్వాత విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కడం..అనూప్ రుబెన్స్ మ్యూజిక్ నాగార్జున రెండు విభిన్నమైన పాత్రలు అన్నీ సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు బాగా కలిసివచ్చాయి. దాంతో నాగార్జున – దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని డిసైడయ్యారు. ఎట్టకేలకి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత బంగార్రాజు సెట్స్ మీదకి వచ్చి శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
అంతేకాదు అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బంగార్రాజు మూవీ నుంచి టీజర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఇటీవల ఈ సినిమాలో నటిస్తున్న కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజై ఆకట్టుకుంది. తాజాగా ఇందులో బంగారాజుగా నటిస్తున్న నాగ చైతన్య ఫస్ట్ లుక్ టీజర్ రిలీజై ఆకట్టుకుంటోంది. సూపర్ రెస్పాన్స్ వస్తున్న ఈ టీజర్ గురించి అక్కినేని అభిమానులు చైతూను ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చూడలేదని..సోగ్గాడే చిన్ని నాయనలో నాగార్జున ఎలా కనిపించాడో ఇప్పుడు చైతూ అలాగే కనిపిస్తున్నాడని చెప్పుకుంటున్నారు.
Naga chaithanya: అప్పుడు బంగార్రాజుగా నాగ్ నటిస్తే ఇప్పుడే అదే బంగారాజుగా చైతూ..!
అప్పుడు బంగార్రాజుగా నాగ్ నటిస్తే ఇప్పుడే అదే బంగారాజుగా చైతూ కనిపించబోతుండటం విశేషం. చిన బంగార్రాజు అని తాజా టీజర్ రిలీజైనప్పటి నుంచి అక్కినేని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో నాగార్జున, నాగచైతన్యలు తాతా మనవళ్ళుగా కనిపించబోతున్నారని టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ నాగార్జున సరసన నటిస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా పూర్తైతే సంక్రాంతిబరిలో బంగార్రాజు సినిమాను దింపాలని చూస్తున్నారు నాగార్జున. ఈ సినిమాను అన్నపూర్ణ బ్యానర్ – జీ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!