నాగబాబు అంత ఎమోషనల్ అవ్వడం ఇదే మొదటి సారి.. నీహారిక చేసిన పనికి!

మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికి అన్న, తమ్ముడు అంత స్టార్ నటుడు కాకపోయినా పిల్లలు ఇద్దరు మాత్రం మంచి ఫెమ్ సంపాదించుకున్నారు. ఇద్దరు కూడా నటన పరంగా మంచి మార్కులు కొట్టేశారు. వరుణ్ తేజ్ స్టార్ హీరోగా కొనసాగుతుండగా మెగా డాటర్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతుంది.

 

ఇక అలాంటి ఈ సమయంలో నిన్న (సెప్టెంబర్ 27) డాటర్స్ డే సందర్భంగా నాగబాబు ఒక ఏమోషనల్ పోస్ట్ పెట్టారు. నాగబాబుకు తన కూతురు అంటే ఎంత ఇష్టమొ చెప్పాల్సిన పని లేదు. నిహారిక అంటే పంచ ప్రాణాలు. ఆమె ఐదు నిమిషాలు కనిపించకపోయినా కోపం వచ్చేసాదట నాగబాబుకి. ఇక నాగబాబు తన ముద్దుల కూతురు గురించి నెట్టింట ఇలా చెప్పుకొచ్చారు..

కూతుర్లు అంటే.. మనం కలలు కనే చిట్టి దెయ్యాలు కూతుర్ల రూపంలో భూమ్మీదకు వస్తాయ్.. మనల్ని నవ్విస్తారు.. ఏడిపిస్తారు.. ఆట పట్టిస్తారు.. చిరాకు పుట్టిస్తారు.. ఇలా మొత్తానికి మనల్ని ప్రేమలో పడేసేందుకు వస్తారు.. హ్యాపీ డాటర్స్ డెయ్ టు మై డ్రీమ్ డెవిల్.. ఈ భూమ్మీద ఉన్న ప్రతి దెయ్యానికి డాటర్స్ డే శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశాడు. అంతే నిన్నటి నుంచి ఆ ట్విట్ తెగ వైరల్ అవుతుంది. కాగా ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న ఈ మెగా డాటర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది.