బ్రహ్మజి.. ఇతడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయినా సరే అద్భుతంగా నటిస్తాడు. విలన్ పాత్ర అయినా.. కామెడీ పాత్ర అయినా.. ఇంకేదైనా అద్భుతంగా నటిస్తాడు. అలాంటి అద్భుత విలక్షణ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటాడు. అదిరిపోయే పంచ్ లు వేస్తూ అల్లరి చేస్తుంటాడు బ్రహ్మాజీ.
ఇక ఈ నేపథ్యంలోనే నిన్న డాటర్స్ డే సందర్భంగా కోడలు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అతడితో పాటు ఉన్న కోడలు ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ డాటర్స్ డే.. నా కోడలు.. కూతురుతో సమానం అంటూ పోస్ట్ చేశాడు. కానీ ప్రజలంతా అలా ఉండరు కదా! ఒకోకరు ఒకోలా ఉంటారు. తల్లికి బిడ్డకి, కోడలుకు భార్యకు తేడా తెలియని మనుషులు కూడా ఉంటారు.
ఇక అలానే అతడి కోడలు ఫోటో కూతురు అని పోస్ట్ చేస్తే ఒక నెటిజన్ క్యాప్షన్ చదవకుండా నైస్ కపుల్ అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఆ కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆ కామెంట్ చుసిన బ్రహ్మాజీ కూడా తన కోడలు అని.. కూతురితో సమానం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అలా కామెంట్ చేసిన వ్యక్తిని తిడుతూ.. ఏంటి బాబు ఇలా కూడా ఉంటారా? కామెంట్ పెట్టేముందు క్యాప్షన్ చదివి కామెంట్ చెయ్యండి అంటూ సలహాలు ఇస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!