స్టార్ హీరో, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఆరుపదుల వయస్సులో కుర్ర హీరోలా మంచి స్ప్ప్డ్ మీద ఉన్నారు. మిగతా నటుల్లాగా స్టార్ డమ్ కోసం స్టార్ డైరెక్టర్స్ వెంట పరుగులు తీయకుండా టాలీవుడ్ కి న్యూ టాలెంట్ ని పరిచయం చేస్తూ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నారు. తాను నటించే ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తాను ఆన్ని పాత్రలకు సూట్ అవుతానని నిరూపిస్తున్నారు నాగ్. ఒకరకంగా తన సినీ ప్రయాణంలో ఎప్పటికప్పుడు మేకోవర్ అవుతూ వస్తున్నా నాగార్జున.. అలసిపోని కెరటంలా నిరంతరం ఏదో ఒక పనిలో అంటే ఒక వైపు వెండితెరపై మెరుపులు మెరిపిస్తూనే, బుల్లితెరపై కూడా అలరిస్తున్నారు.
శరీరానికి వయస్సు కానీ మనస్సుకు కాదని ఏజ్ అనేది జస్ట్ ఇతరులకు చెప్పడానికి పనికి వచ్చే నంబర్ మాత్రమే అనేలా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బుల్లితెర ‘బిగ్ బాస్’ తెలుగు రియాలిటీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున మూలంగానే రోజు రోజుకి దిగజారిపోతున్న ‘బిగ్ బాస్’ షో కి రేటింగ్స్ వస్తున్నాయని ఫిలిం నగర్ లో టాక్. అదీగాక ఐపీఎల్ సీజన్ నడుస్తున్న సమయంలో కూడా వీకెండ్స్ లో నాగ్ వచ్చే ఎపిసోడ్స్ కి మంచి రేటింగ్స్ వస్తున్నాయంటే ఇప్పటికీ నాగార్జునను ఫ్యామిలీ ఆడియన్స్ మన్మథుడుగా ఆదరిస్తున్నారని తెలుస్తుంది.
ఇక చిత్రాల విషయానికి వస్తే ప్రస్తుతం మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ‘వైల్డ్ డాగ్’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో అహిషోర్ సాల్మోన్ అనే మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు నాగార్జున. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చాడు నాగార్జున. మొత్తానికి కరోనా ని కూడా లెక్క చేయకుండా ఇటు బుల్లి షోస్ తో అటు సినిమాలతో బిజీగా ఉన్న నాగార్జున మిగతా సీనియర్ హీరోలకి షాకిస్తున్నాడనే చెప్పాలి. కాగా నాగార్జున త్వరలో బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర షూటింగ్ లో జాయిన్ కానున్నాడని సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!