Nani : నేచురల్ స్టార్‌గా నాని కి టాలీవుడ్ లో ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అష్టా చమ్మా సినిమాతో హీరోగా మారిన నాని ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. అందుకు కారణం నాని ఎంచుకునే కథలు పూర్తిగా ఫ్యామిలీ కథాంశాలు కావడమే. మాస్ ఇమేజ్ కంటే నానికి మన పక్కింటి కుర్రాడే అన్న ఇమేజ్ అందరిలో ఉండటం గొప్ప విషయం. ఇక నాని తో సినిమా నిర్మించాలన్నా కూడా నిర్మాతలు ఎప్పుడు ముందుంటారు. నాని సినిమాతో ఏ నిర్మాత రోడ్డున పడింది లేదు.
బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ హీరోగా నానికి మంచి క్రేజ్ ఉంది. నాని సినిమా భారీ లాభాలు తీసుకు రాకపోయినా కూడా నిర్మాత ఎప్పుడు సేఫ్ గా ఉంటాడు. అందుకే యావరేజ్ హిట్ సినిమాలు వచ్చినా..ఒకటి రెండు సినిమాలు నిరాశ పరచినా నాని చేతినిండా సినిమాలుంటాయి. కాగా రీసెంట్ గా 2019 గాను ఉత్తమ జాతీయ చిత్రంగా నాని నటించిన జెర్సీ సినిమాకి అవార్డులు దక్కాయి. మహేష్ బాబు నటించిన మహర్షి, నాని నటించిన జెర్సీ సినిమాలకి అవార్డులు దక్కడంతో ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసలతో ముంచేస్తున్నారు.
Nani : నాని మీద జెర్సీ సినిమా ఒత్తిడి పెంచింది.
అయితే ఇది నాని మీద బాధ్యత పెంచిందని చెప్పుకొచ్చాడు. జెర్సీ సినిమా ఒత్తిడి పెంచిందని ఇక పై చేసే ప్రతీ సినిమా ఎంతో జాగ్రత్తగా చేయాల్సి ఉందని తెలిపాడు. ప్రస్తుతం నాని టక్ జగదీష్, శ్యాం సింగ రాయ్, అంటే సుందరానికి సినిమాలు చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. టక్ జగదీష్ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో నిన్నుకోరి వచ్చి పెద్ద సక్సస్ ని సాధించింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!