Pooja hegde: నువ్వింత చీప్ అనుకోలేదు..పూజా హెగ్డేపై ఫైర్ అవుతున్న నెటిజన్స్..?

Share

Pooja hegde: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపై ఇప్పుడు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారట. తెలుగు, హిందీ, తమిళ సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది. ఈ స్ట్రెస్ నుంచి కాస్త రిలాక్స్ అవ్వాలని ఇటీవల అమ్మడు మాల్దీవులకి వెళ్ళి సరదాగా సేద తీరి కూడా వచ్చింది. ట్రిప్ బాగా ఎంజాయ్ చేసి వచ్చిన పూజా త్వరలో బాలీవుడ్ మూవీ షూట్‌లో జాయిన్ కాబోతోందని సమాచారం. హిందీలో పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న కభీ ఈద్ కభీ దీవాళి అనే సినిమాలో నటిస్తోంది. అలాగే రణ్‌వీర్ సింగ్ సరసన సర్కస్ అనే సినిమాను చేస్తోంది.

netizens are firing on pooja-hegde-
netizens are firing on pooja-hegde-

ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ను సమాంతరంగా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుందట. అంతేకాదు మధ్యలో కొన్ని డేట్స్ తమిళ సినిమాకు కేటాయించిందని తెలుస్తోంది. కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన పూజా ఇటు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ అయితేగానీ మళ్ళీ తమిళం మేకర్స్‌కు పూజా కనిపించలేదు. కాగా అక్కడ స్టార్ హీరో విజయ్‌తో అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బీస్ట్ అనే పాన్ ఇండియన్ సినిమాను చేస్తోంది. ఈ సినిమాను వచ్చే సమ్మర్‌లోపు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుందట. ఇలా వరుసగా సినిమాలు చేస్తూనే ప్రమోషనల్ యాడ్ ఫిలింస్‌లోనూ అమ్మడు జోరు చూపిస్తోంది.

Pooja hegde: పూజా ఇంకా పెద్ద బ్రాండ్స్ చాలా ఉన్నాయి కదా..!

ఈ క్రమంలోనే తాజాగా పూజా హెగ్డే  మందు బాటిల్ ముందు పెట్టుకొని పెగ్ ఫిక్స్ చేసి ఆనందంతో చిందులేసింది. ఈ మధ్య సినీ తారలు మంచి రెమ్యునరేషన్ ఇస్తే ఫారిన్ మందును ప్రమోట్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ఆ లిస్ట్‌లో మన బుట్టబొమ్మ కూడా ఉందట. ఇక తాజాగా ఈమె జానీ వాకర్ రెడ్ లేబుల్ బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా మందు – ఐస్ క్యూబ్స్ వేసి పెగ్ ఫిక్స్ చేసింది. అది జనాలకు చూపిస్తూ ఆనందంగా లేచి చిందులేసింది. అయితే ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్స్ మరీ ఇంత చీప్ బ్రాండ్ ఏంటీ పూజా ఇంకా పెద్ద బ్రాండ్స్ చాలా ఉన్నాయి కదా..అలాంటి వాటిని కదా మాకు చెప్పాల్సింది..చూపించాల్సింది అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఆమె నటించిన రాధే శ్యామ్ 2022. జనవరి 14న రిలీజ్ కానుంది. ఆ తర్వాత చరణ్ సరసన నటించిన ఆచార్య రిలీజ్ కానుంది.


Share

Related posts

Sai Pallavi: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ పోస్టర్స్ చూశారా..!!

bharani jella

Corona Effect: అసెంబ్లీ, పార్లమెంట్ ఉప ఎన్నికల నిర్వహణపై ఈసీ కీలక నిర్ణయం..!!

somaraju sharma

సోనూసూద్ కు తెలుగు హీరోలకు మధ్య తేడా అదే: పోసాని

Muraliak