NewsOrbit
Featured న్యూస్ సినిమా

Nidhi agarwal: గల్లా అశోక్ డెబ్యూ మూవీకి నిధి అగర్వాల్ పెద్ద ప్లస్ పాయింట్ అయ్యేలా ఉందే..!

Nidhi agarwal: సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో యంగ్ హీరో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. అతనే గల్లా అశోక్. ఈ యంగ్ హీరోకి అటు పొల్టికల్ బ్యాక్‌గ్రౌండ్..ఇటు సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అందుకే ఈ యంగ్ హీరో డెబ్యూ సినిమా మీద చాలా అంచనాలున్నాయి. వాస్తవంగా అశోక్ మొదటి సినిమా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో వచ్చి ఎప్పుడో రెండేళ్ళ క్రితమే హీరో క్రేజ్ తెచ్చుకోవాల్సింది. అయితే అనివార్యకారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ మొదలై ఆగైపోయింది.

nidhi-agarwal-is going to become plus point for galla ashok debue movie
nidhi agarwal is going to become plus point for galla ashok debue movie

ఆ తర్వాత అదే సినిమాను యంగ్ హీరో రాజ్ తరుణ్‌తో ఇద్దరి లోకం ఒకటే అనే టైటిల్‌తో రూపొందించారు. శాలిని పాండే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మీద రాజ్ తరుణ్ చాలా అంచనాలు పెట్టుకున్నాడు. కానీ ఊహించని విధంగా ఇద్దరి లోకమొకటే సినిమా భారీ డిజాస్టర్‌గా మిగిలింది. కథ బావుంది గానీ గల్లా అశోక్ అంతగా పర్ఫార్మ్ చేయలేకపోతున్నాడనే దిల్ రాజు బృందం ఆయనతో షూటింగ్ మొదలు పెట్టి కూడా మధ్యలో ఆపేసినట్టు చెప్పుకున్నారు. అయితే ఈ సినిమా ఫ్లాపవడంతో అశోక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడమే మంచిదైంది అని హీరో తరపువాళ్ళు అనుకున్నారట.

Nidhi agarwal: విడుదలైన సెకండ్ సింగిల్ తో ఇంకా బాగా పెరిగాయి.

అయితే హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యేముందు యాక్టింగ్ కోర్స్ చేసి హీరో ఎంట్రీకి రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. సొంత నిర్మాణ సంస్థలో గల్లా అశోక్ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే హీరో అని టైటిల్ పోస్టర్, యమలీల సినిమాలో సాంగ్ రీమేక్ లిరికల్ సాంగ్, టీజర్, ఇటీవల వచ్చిన మరో లిరికల్ సాంగ్ సినిమా మీద బాగా అంచనాలు పెంచాయి. భారీ హిట్ అవుతుందనే విషయం పక్కన పెడితే అంచనాలు మాత్రం బాగానే ఏర్పడ్డాయి. ఆ అంచనాలు తాజాగా విడుదలైన సెకండ్ సింగిల్ తో ఇంకా బాగా పెరిగాయి.

అందుకు కారణం ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ అని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. అశోక్ హీరోగా మొదటి సినిమా అయినా హీరోయిన్‌గా నిధికి మాత్రం ఇది ఏడవ సినిమా. హిందీలో ఓ సినిమా చేసిన నిధి..తెలుగులో మూడు సినిమాలు హీరోయిన్‌గా చేసి క్రేజీ హీరోయిన్‌గా మారింది. తమిళంలో రెండు హిట్ సినిమాలు చేసింది. అలా ఆమెకు సౌత్ అండ్ నార్త్‌లో బాగా క్రేజ్ ఉంది. అదే ఇప్పుడు డెబ్యూ హీరోకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పుకుంటున్నారు. సినిమాల పరంగా అలాగే నిధి గ్లామర్ పరంగా హీరో సినిమాకు ఎసెట్ అవుతుందని అంటున్నారు.

Nidhi agarwal: గల్లా అశోక్ మొదటి సినిమాకి కూడా ఇదే సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందా..?

నిధి ఒకరకంగా హీరోలకి లక్కీ హీరోయిన్ అనే టాక్ ఉంది. చాలా కాలంగా రామ్ పోతినేనికి హిట్స్ లేవు. కానీ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి హీరోయిన్. బాగా కలిసి వచ్చింది. ఈ సినిమా లాంటి హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఇక తమిళంలో శింబుతో, జయం రవితో చేసిన సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఆ రకంగా చూసుకునే గల్లా అశోక్ మొదటి సినిమాకి కూడా ఇదే సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందని చెప్పుకుంటున్నారు. ఇక నిధి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో హీరోయిన్. ఇందులో ఆమె డాన్సర్‌గా కనిపించబోతోంది. ఇది పాన్ ఇండియన్ సినిమా.

 

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu