న్యూస్ సినిమా

క్రాక్ లో వెంకటేష్ చేసి ఉంటేనా.. అబ్బే అంటున్న ఫ్యాన్స్ ..?

Share

క్రాక్ .. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం గొప్పగా చెప్పుకుంటున్న సినిమా. రవితేజ తో పాటు ఈ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని ని ప్రముఖులందరు పొగడ్తలతో ముంచేస్తున్నారు. చాలాకాలం తర్వాత భారీ హిట్ అందుకున్న raviteja కట్టలు తెంచుకున్న ఆనందంలో ఉన్నాడు. నిర్మాత ధైర్యంగా గుండెల మీద చేయి వేసుకొని పడుకునేలా పెద్ద కమర్షియల్ సక్సస్ ని ఇచ్చాడు గోపీచంద్ మలినేని. కరోనా కారణంగా ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలం అయిన సంగతి తెలిసిందే.

Ravi Teja kisses Shruti Haasan - tollywood

అయితే అందరికంటే ముందు తన సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేసి మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ టాలీవుడ్ కి ఆశలు కల్పించాడు. ఇప్పుడు raviteja డేరింగ్ స్టెప్ తీసుకొని సంక్రాంతి పండుగ సందర్భంగా క్రాక్ ని రిలీజ్ చేసి భారీ హిట్ సాధించి ఇండస్ట్రీ వర్గాలలో ఉన్న అనుమానాలని పటాపంచలు చేశాడు. ఈ సినిమా సక్సస్ తో టాలీవుడ్ కి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేసింది. ఇక నుంచి నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ విషయంలో ఎలాంటి భయాలు పడాల్సిన పనిలేదని raviteja నిరూపించాడు.

Shruti Haasan starring Krack movie to release in Jan 2021

ఇంత పెద్ద సక్సస్ అందుకున్న krack నిజంగా raviteja లైఫ్ లో అన్నీ రకాలుగా గుర్తుండిపోతుంది. అయితే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రాక్ సినిమా కథ ముందు విక్టరీ వెంకటేష్ వద్దకి వెళ్ళగా కథలో కొన్ని మార్పులు చెప్పాడట. ఆ మార్పులు చేయలేని దర్శకుడు గోపీచంద్ మలినేని తర్వాత రవితేజ తో krack గా తీసి సెన్షేషనల్ హిట్ అందుకున్నాడు. దాంతో అయ్యే వెంకీ అకౌంట్ లో ఒక హిట్ మిస్ అయిందే అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారట. కాని కొంతమంది మాత్రం అబ్బే క్రాక్ వెంకీ కి సూటయ్యేది కాదేమో .. మిస్ అయిందే మంచిది అని అభిప్రాయపడుతున్నారట. ఏదేమైనా krack సినిమా సక్సస్ ని మాత్రం ఇండస్ట్రీ మొత్తం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది.


Share

Related posts

ఎన్.టి.ఆర్ 30 నుంచి అదిరిపోయే అప్‌డేట్ .. ఎప్పటినుంచి సెట్స్ మీదైకి వస్తుందో చెప్పిన త్రివిక్రం ..!

GRK

మోడీ చిరకాల కోరిక కి NO చెప్పబోతున్న జగన్..!

CMR

కొత్త క్రెడిట్ కార్డులు, డిజిటల్ 2.O పై హెచ్‌డీఎఫ్‌సీ కి …..ఆర్‌బీఐ కొత్త ఆదేశాలు

Vissu
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar