ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ హెల్త్

షాక్ః క‌రోనా వ్యాక్సిన్ తీసుకుంటే ఇన్ని స‌మ‌స్య‌లుంటాయా?

Share

దాదాపు ఏడాదిగా ఎదురుచూస్తున్న క‌రోనా వ్యాక్సిన్ ప్ర‌జ‌ల‌కు చేరువ అయింది. దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్ అంద‌జేస్తున్నారు. ముఖ్యంగా సీరమ్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్‌‌‌‌ వ్యాక్సిన్ మెజార్టీ ప్ర‌జ‌ల‌కు అందుతోంది.

అయితే , క‌రోనా వ్యాక్సిన్ వ‌ల్ల వ‌చ్చే ప‌లు సైడ్ ఎఫెక్ట్స్ గురించి ప్ర‌జ‌ల్లో టెన్ష‌న్ మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో తమ సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్‌‌‌‌ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌‌‌‌ వివరాలను సీరమ్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ వెల్లడించింది. అందులో , ప‌లు ఆస‌క్తిక‌ర వివ‌రాలున్నాయి.

క‌రోనా వ్యాక్సిన్ … ఇవ‌న్నీ సైడ్ ఎఫెక్ట్స్‌

18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారే వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. ఒక్కో డోసు 0.5 ఎంఎల్ ఉంటుందని, తొలి డోసు తీసుకున్న 4 నుంచి 6 వారాల మధ్యలో రెండో డోసు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయని తెలిపింది. వెరీ కామన్, కామన్‌‌‌‌, అన్‌‌‌‌ కామన్ పేరిట 3 రకాల సైడ్ ఎఫెక్ట్స్‌‌‌‌ వివరాలను సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది. ప్రతి 10 మందిలో ఒకరి కంటే ఎక్కువ మందికి వెరీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చని, ప్రతి పది మందిలో ఒకరికైనా కామన్ సైడ్ ఎఫెక్ట్స్‌‌‌‌ వస్తాయని పేర్కొంది. ప్రతి వందలో ఒకరికి అన్‌‌‌‌కామన్ సైడ్‌‌‌‌ ఎఫెక్ట్స్‌‌‌‌ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇవన్నీ తాత్కాలికమే అయినా ఇంతకంటే పెద్ద ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చని తెలిపింది.

వెరీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్‌‌‌‌

నొప్పి, దురద, వాపు, అలసట, తలనొప్పి, జ్వరం వచ్చిన ఫీలింగ్ కలగడం, జాయింట్ పెయిన్స్‌‌‌‌, కండరాల నొప్పి, ఏదో జబ్బు చేసిన ఫీలింగ్, ఎర్రబారడం

కామన్ సైడ్ ఎఫెక్ట్స్‌‌‌‌

ఇంజక్షన్ వేసిన దగ్గర గడ్డలు ఏర్పడటం, జ్వరం, వాంతులు, బాడీ టెంపరేచర్‌ పెరగ డం, ముక్కు కారడం, దగ్గు, గొంతు మంట

అన్‌‌‌‌ కామన్ సైడ్ ఎఫెక్ట్స్‌‌‌‌

మత్తెక్కడం, పొత్తి కడుపులో నొప్పి, ఆకలి తగ్గడం, చెమట రావడం, చర్మంపై ర్యాషెస్, విపరీతమైన దురద రావడం


Share

Related posts

social Media; ఏపి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటికే పరేషాన్…!ఎందుకంటే..?

somaraju sharma

మందిర నిర్మాణానికి మంచి తరుణం

Siva Prasad

డ్రీమ్ 11 పై నిషేదాలు..

S PATTABHI RAMBABU
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar