మాస్ మహారాజ రవితేజ కి టాలీవుడ్ లో ఉన్న మాస్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. వరసగా ఫ్లాప్స్ వస్తున్నా కూడా రవితేజ కి టాలీవుడ్ లో వస్తున్న ఆఫర్స్ చూస్తే అందరికీ షాకింగ్ గా ఉంటోందట. అంతేకాదు రవితేజ రెమ్యూనరేషన్ విషయంలో కూడా అసలు కాంప్రమైజ్ కావడం లేదని చెప్పుకుంటున్నారు. సినిమా ఫ్లాప్ హిట్ ల తో సంబంధం లేకుండా 13 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తోంది. అంతేకాదు సినిమా గనక మంచి వసూళ్ళు సాధిస్తే లాభాలలో వాటా కూడా ఇస్తున్నారని అంటున్నారు.
కాగా రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటి వరకు రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్నాడు. ఇద్దరు హ్యాట్రిక్ హిట్ కోసమే గట్టిగా ట్రై చేస్తున్నాడు. కరోనా కారణంగా ఇన్ని నెలలు ఆగిపోయిన క్రాక్ సినిమా ఎట్టకేలకి జనవరి 14 న సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే రవితేజ ఈ సినిమాతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలన్న కసితో సినిమా కోసం ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. గత రెండు నెలలుగా క్రాక్ సినిమా ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు రవితేజ.
తాజాగ ఈ సినిమా నుంచి మరో సాంగ్ ని రిలీజ్ చేశారు క్రాక్ సినిమా మేకర్స్. ఇప్పటికే రవితేజ తో అప్సర రాణి స్టెప్పులేసిన భూం బద్దల్ అలాగే రవితేజ – శృతి హాసన్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన సాంగ్ ని రిలీజ్ చేసిన చిత్ర బృందం ‘కొరమీసం పోలీసోడా’ అన్న మరో మాస్ సాంగ్ ని రిలీజ్ చేశారు. మొత్తానికి సాంగ్స్ పరంగా క్రాక్ బాగానే ఆకట్టుకుంది. సినిమా మ్యూజిక్ పరంగా హిట్ టాక్ వస్తే సినిమా కూడా దాదాపు హిట్ అయినట్టే. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ ఖిలాడి అన్న సినిమా చేస్తున్నాడు.