ప్రజలను రక్షించేవాడే రెడ్డి : పవన్

కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండా రెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన భహిరంగ సభలో ప్రసింగించారు.

కర్నూలు అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గుర్తు వస్తారని పవన్ అన్నారు. ప్రజలను రక్షించేవాడే రెడ్డి అన్నారు. రెడ్డి కులం కాదన్నారు. కులాలు తెలియని ఎంతో మంది మహానుభావులు దేశాన్ని అభివృద్ధి చేశారని పవన్ అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో కుల ప్రస్తావన ఎక్కువైంది, కులాలు తెలియని రాజకీయాలు కావాలి అని అన్నారు. రాయలసీమ నుంచి ఏంత మంది సీఎంలు వచ్చినా ఆ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిందని పవన్ తెలిపారు.

అధికారం ఉన్నవారికే ఉద్యాగాలు , వ్యాపారాలు అని వ్యాఖ్యానించారు. కుటంబ కబంద హస్తాల్లో రాజకీయం నలిగిపోతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

యువత తనను సీఎం కావాలని కోరుకుంటున్నది నా కోసం కాదు… ఉద్యోగాల కోసం, దౌర్జన్యాన్ని ఎదుర్కొవడానికి అని పవన్ వ్యాఖ్యానించారు. జనం మార్పు కోరుకుంటున్నారని పవన్ తెలిపారు. రౌడీయిజం ఆగిపోవాలని కోరుకుంటున్నారు అని పవన్ అన్నారు.

మార్పుకోసమే జనసేన స్థాపించానని పవన్ అన్నారు. అలా అని రాత్రికి రాత్రే అద్భుతాలు చేస్తానని చెప్పట్లేదన్నారు. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు అని పవన్ అన్నారు. పదవులు వున్నా, లేకున్నా ప్రజల కోసం పనిచేస్తానని పవన్ వెల్లడించారు.

ధనరాజకీయలు, ముఠా రాజకీయాలు చేయనన్నారు. నా దగ్గర డబ్బులు లేవు. అండగా చానెల్స్ లేవు. జనసైనికులు నా ఛానల్ నా పేపర్ అని పవన్ అన్నారు. మీడియాని నమ్మి రాజకీయాల్లోకి రాలేదని అన్నారు.