Pawan Kalyan : త్రివిక్రమ్ శ్రీనివాస్..! పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ పేరు చాలా ఇష్టం. ‘అత్తారింటికి దారేది’ వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’ లాంటి డిజాస్టర్ కూడా పవన్ అభిమానులకు రుచి చూపించాడు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా, ఇష్ణుడిగా త్రివిక్రమ్ అంటే వారికి ఎంతో ప్రేమ ఉంది. మరి సోషల్ మీడియాలో త్రివిక్రమ్ కు వ్యతిరేకంగా పోస్టులు ఎందుకు పెడుతున్నారు…? అతనిని ఎందుకు పవన్ కి దూరంగా ఎందుకు ఉండమంటున్నారు?
విషయం ఏమిటంటే… పవన్ కళ్యాణ్- రానా కాంబినేషన్ లో మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషీయుం’ కి రీమేక్ గా ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకుడు అయితే తెర వెనుక మాత్రం మాత్రం త్రివిక్రమ్ హస్తమే ఎక్కువ. స్క్రీన్‌ప్లే, మాటలు అంటూ సింహభాగం తనే సినిమాని ముందుండి నడిపిస్తున్నారు. ఇక త్రివిక్రమ్ మాస్ స్టోరీలకు ఎలాంటి క్లాస్ టచ్ ఇస్తారో అందరికీ తెలిసిందే. అతని చేయి పడితే కొత్త మార్పులు పుట్టాల్సిం. త్రివిక్రమ్ నుండి అంతా మంచి ఎంటర్టైన్మెంట్ ఆశిస్తారు.
అందుకే ఆయన సినిమాలు ఫ్యామిలీలను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. పోలీస్‌స్టేషన్‌లో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ బ్యాచ్ ని పెట్టి వినోదం క్రియేట్ చేసే ప్రయత్నాలు ప్రస్తుతం ఈ సినిమా రీమేక్ లో జరుగుతున్నాయట. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కు ఒక ఫ్లాష్‌బ్యాక్ జోడించారు అన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. అందులోనే ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేస్తున్నారట. అయితే ఒరిజినల్ మలయాళం కథ చాలా సీరియస్ గా సాగుతుంది. ధనికుడైన- పరపతి కలిగిన ఒక వ్యక్తికి…. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కు మధ్య జరిగే ఈగో వార్ ఆధారంగా ఈ సినిమా కథ సాగుతుంది.
అందులో ఫన్, ఎంటర్టన్మెంట్ మిక్స్ చేసే ప్రయత్నం, పవన్ పాత్రను పెంచడం కచ్చితంగా కథకు ఇబ్బంది కలిగించే విషయాలు. మరి త్రివిక్రమ్ తన మార్క్ చూపించుకోవడం కోసం లేక పవన్ ఇమేజ్ పెంచేందుకే ఈ మార్పులు చేస్తున్నారు అన్న విషయం అయితే బయటికి వచ్చింది. అందుకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొద్దిగా ఆందోళన చెందుతున్నారు. పైగా సినిమా ముహూర్తం రోజున త్రివిక్రమ్ సెట్ లో తెగ హడావిడి చేసాడు. ఇదంతా చూసి అందరూ కంగారు పడుతున్నారు కానీ త్రివిక్రమ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అవ్వాలనే కోరుకుంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!