NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Politics : చంద్రబాబుకి సీన్ లేదు.. జగన్ ఏం చేయలేరు.. పవన్ షో చేస్తారు..!!

YS Jagan: Can Control Central upto 2024

AP Politics : * పోలవరానికి జాతీయ హోదా ఉంది. Polavaram Project ఆంధ్రకి జీవనాడి.., కానీ పూర్తి చేయడానికి నిధులివ్వం..! * AP Politics AP State ఆర్ధిక పరిస్థితి బాలేదు. రెవెన్యూ లోటు ఎక్కువగా ఉంది.., కానీ బడ్జెట్ లో నిధులేమి ఇవ్వం..! * ఏపీలో భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమ ఏమి లేదు. Vizag Steel Plant పరిశ్రమ ఒక్కటే ఏపీలో పెద్ద దిక్కుగా ఉంది.., కానీ విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటుకు అమ్మేస్తాం..!! ఎందుకంటే అడిగేవారు లేరు. ఉన్న వారు అడగలేరు. రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి ఇదీ. YS Jagan బలహీనతలు, Chandrababu Naidu లోపాలు చూసుకుని బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుంది..! జగన్ ఎన్ని రాసినా లేఖలు రాయగలరు తప్ప.. ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. చంద్రబాబు ఎన్ని మాటలాడిన ప్రెస్ మీట్ లో నాలుగు అర్ధం కానీ మాటలు చెప్పగలరు తప్ప ఇంకేం చేయలేరు.. అందుకే ఏపీ గురించి బాగా తెలిసిన బీజేపీ బంతాట మొదలు పెట్టింది.

Must Read : విశాఖ ఉక్కు రాజకీయంతో నష్టపోయేదెవరు..!? కీలక విశ్లేషణ

AP Politics : Secret game by BJP
AP Politics : Secret game by BJP

AP Politics : జగన్ పరిస్థితి ఇదీ..!!

సీఎం జగన్ ప్రస్తుతం బీజేపీతో స్నేహం చేయడం లేదు కానీ.. బీజేపీ చేతిలోనే ఉన్నట్టు లెక్క. బీజేపీ అడిగినా, అడగకపోయినా వారితో అంటకాగి తిరగాల్సిందే. బీజేపీ అడిగినా.., అడగకపోయినా మద్దతు ఇవ్వాల్సిందే.., కేంద్రంతో కయ్యం పెట్టుకునేంత వరకు జగన్ ఎదగలేదు. కానీ జగన్ పూర్తిగా బీజేపీ చెప్తే వినాల్సిన పరిస్థితి..! వాటిని కాదనుకుని జగన్ బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా అడుగులు వేసే పరిస్థితి లేదు. ఒకప్పుడు 2011 , 2012 లో సోనియాని ఎదిరించారంటే నాటి పరిస్థితి వేరు, కాంగ్రెస్ ఆలోచన వేరు.. కానీ ఇప్పుడు జగన్ ఒక చట్రంలో ఉన్నారు. బీజేపీ ఆ చట్రాన్ని నడిపిస్తుంది. బీజేపీ చేతిలో ఉన్న వ్యవస్థలతో జగన్ కీలుబొమ్మగా ఆదుకునే అవకాశం ఉంది. అందుకే జగన్ ఇటు ఏపీ సీఎంగా ఉన్నారు కాబట్టి… కొన్ని లేఖలు ద్వారా అడగడం.., రిక్వెస్ట్ చేయడం తప్ప ఇంకో అడుగు ముందుకు వేయలేరు. ఇది బీజేపీకి కలిసొచ్చే అంశమే..!

AP Politics : చంద్రబాబుని ఇరికించడం ఈజీ..!!

ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కూడా బీజేపీని గట్టిగా ప్రశ్నించి, ఎదిరించి నిలబడే పరిస్థితి లేదు. చంద్రబాబుకి ఉన్న రాజకీయ అనుభవం, లాబీయింగ్ కెపాసిటీ, వ్యవస్థల మేనేజ్మెంట్ తో స్టీల్ ప్లాంట్ విషయంలో జాతీయ స్థాయిలో పోరాడవచ్చు. కానీ అది బాబుకి రిస్క్. 2019 ఎన్నికల్లో ఊహించని దెబ్బతినేసిన చంద్రబాబుకి.. జగన్ ని కొట్టడానికి ఎప్పుడెప్పుడు బీజేపీని, మోడీని కలిసి ఎన్డీఏలో చేరిపోదామా అని ఉంది..! సో.. చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేరు, ఉద్యమం నడపలేరు. బీజేపీ ఇప్పుడున్న బలంతో కొడితే చంద్రబాబు రాజకీయం గింగిరాలు తిరుగుతుంది. అందుకే ప్రతిపక్ష నేతగా కొన్ని మీడియా సమావేశాలు పెట్టడం.., నల్ల చొక్కా వేసుకుని నాలుగు మాటలు చెప్పడం తప్ప.., ఇంకేం చేయలేరు. ఇది బీజేపీకి కలిసొచ్చే అంశమే..!
సో.. అటు వైసీపీ కానీ, ఇటు టీడీపీ కానీ విశాఖ జిల్లా నాయకుల వరకు కొన్ని మాటలు మాట్లాడి, బీజేపీకి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు చేస్తే చేయాలి తప్ప రాష్ట్రస్థాయిలో చంద్రబాబు, జగన్ స్థాయిలో చేసేదేమి లేదు.

AP Politics : Secret game by BJP
AP Politics : Secret game by BJP

* పవన్ కళ్యాణ్ బీజేపీతో స్నేహంగా ఉంటూ బీజేపీ నిర్ణయాలను గట్టిగా వ్యతిరేకించే పరిస్థితి లేదు. “తను ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు.. విశాఖ ఉక్కు పరిశ్రమని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఒకసారి ఢిల్లీ వెళ్లి బిల్డప్ ఇవ్వడం తప్ప.. ఫలితం వచ్చేలా పోరాటం చేయడం.., బీజేపీని ఒప్పించే సీన్ పవన్ కళ్యాణ్ కి లేదు. ఆ మాత్రమే ఉంటే.. పోలవరానికి బీజేపీ నిధులివ్వనప్పుడు.., కేంద్ర బడ్జట్ లో ఏపీకి సున్నాలు వేస్తున్నప్పుడు పవన్ చేసిందేమి లేదు. ఇప్పుడు కూడా చేసేదేమి ఉండదు. ఇది కూడా ఆయనకు సినిమా తప్ప.., ఇంకేం ప్రయోజనం ఉండదు.

నిస్సహాయ రాష్ట్రం… బీజేపీ బంతాటకి వేదిక..!!

సో.. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏమిటంటే.. ఏపీలో ఒక పెద్ద రాజకీయ అగాధం సృష్టించి.., ఏపీకి కొన్ని నష్టాలు చేకూర్చి.. “అరేయ్ బాబులూ… బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలా జరగడం లేదు. మీ రాష్ట్రంలోనే ఇలా జరుగుతుంది. అందుకే మాకు అధికారం ఇవ్వండి. బీజేపీకి ఓటేయండి. బీజేపీని పట్టించుకోండిరా బాబులూ” అని రివర్స్ రాజకీయం చేయడమే బీజేపీ అజెండా కావచ్చు. రాష్ట్రానికి కొత్తవి ఇవ్వకపోగా.. ఉన్నవి కూడా లేపేస్తుంటే ఇంతకంటే బీజేపీని ఇంకేం అనలేరు. పైన చెప్పుకున్న ముగ్గురు నేతలూ ఏమి చేయలేరు. అందుకే బీజేపీ అంతరార్ధం కూడా అదే కావచ్చు..!!

 

 

 

 

 

 

 

 

Related posts

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!