Pooja Hegde: వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో విడుదలైన సినిమా గద్దల కొండ గణేష్.. ఈ సినిమాలో శ్రీదేవి గా పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించారు.. ఈ చిత్రంలో పూజ హెగ్డే నటించిన “ఎల్లువొచ్చి గోదారమ్మ” సాంగు 100 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.. ఈ విషయాన్ని ఈ చిత్ర యూనిట్ అధికారికంగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు..!!

Read More: Daare Leda: మన హీరోల కోసం దారే లేదా అంటున్న నాచురల్ స్టార్..!!
డైరెక్టర్ హరీష్ శంకర్ పాత ఎల్లువొచ్చి గోదారమ్మ పాటను రీమేక్ చేయాలని ఆయన కల.. ఈ పాట రీమేక్ చేసి 100 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకోవడానికి కారణమైన హరీష్ శంకర్ కి పూజ కృతజ్ఞతలు తెలియజేసింది.. అలాగే వరుణ్ తేజ్ కి ఈ చిత్ర యూనిట్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.. ఈ పాటను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు స్పెషల్ థాంక్యూ చెప్పింది పూజా హెగ్డే.. ఈ చిత్రాన్ని గోపి ఆచంట, రామ్ ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రంలో వరుణ్ సరసన మృణాళిని నటించింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచి వరుణ్ ఖాతాలో ఒక హిట్ వేసింది.. ఇప్పుడు పూజా హెగ్డే నటించిన ఇస్ స్పెషల్ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ ని సాధించి పూజా హెగ్డే ఖాతాలో మరో రికార్డ్ సొంతం చేసుకుంది.