Radhe Shyam : ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్ రాజ్యం నడుస్తోంది. వరుసగా నాలుగు ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ భారతదేశంలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిపోయాడు. హీరోయిన్ల విషయానికి వస్తే టాలీవుడ్ లో పూజా హెగ్డే అందరికన్నా ముందుంది అనే చెప్పాలి. స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ప్రభాస్ సరసన ‘రాధే శ్యామ్’ సినిమాలో కనిపించబోతోంది.
గత రెండేళ్లలో పూజ హెగ్డే డిమాండ్ భారీగా పెరిగిపోయింది. తన అందచందాలతో ‘అల వైకుంఠపురం’ చిత్రాంలో కుర్రకారుని ఫిదా చేసిన పూజ ఇప్పుడు పూర్తి లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో ‘రాధే శ్యామ్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ప్రభాస్-పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ బాగా పండింది అని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులలో పూజ బిజీగా ఉంది.
పూజ ఎంతటి బిజీ హీరోయిన్ అంటే ఆమెకు బాలీవుడ్ లో కూడా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. మామూలుగా స్టార్ హీరోయిన్లందరూ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని పెట్టుకుని నటిస్తారు. అయితే పూజా హెగ్డే మాత్రం ‘రాధే శ్యామ్’ సినిమా కోసం తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటోంది. ప్రేమ కథల లో అందం, అభినయం, నటనతో పాటు పెదాలకు సింక్ అయ్యేలాగా హావభావాలు పలికించడం అనేది చాలా ముఖ్యం. అందుకు హీరోయిన్ సొంత వాయిస్ అయితే మరింత ఇంపాక్ట్ ఉంటుంది… ప్రేక్షకులకు కూడా మంచి ఫీలింగ్ వస్తుంది.
ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కోసం అలాగే తన పాత్ర స్క్రీన్ పైన బాగా పండాలని పూజ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంకేముంది ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ అనే తేడా లేకుండా ప్రభాస్ అభిమానులు అందరూ పూజా హెగ్డే కి థాంక్స్ చెప్తున్నారు. ఆమె కూడా వారిని సంతోషపరుస్తూ తను డబ్బింగ్ మొదలు పెట్టినట్లు ఒక పిక్ బయటకు వదిలింది, మరి పూజ చేసిన త్యాగం ‘రాధే శ్యామ్’ సినిమా ను బ్లాక్ బస్టర్ వరకు తీసుకు వెళుతుందో లేదో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!