న్యూస్ సినిమా

Prabhas: ఓరి నాయనో.. ప్రభాస్ కోసం హాలీవుడ్ దర్శకుడు, బాహుబలి ఒక మూలకి కూడా రాదు ఈ ప్రాజెక్ట్ ముందు!

Share

Prabhas: నక్క తోక తొక్కాడు అని అంటూ వుంటారు కదా. అది సరిగ్గా ప్రభాస్ కి సరిపోతుంది. బాహుబలి అనే సినిమా ఏ ముహూర్తాన చేసాడో ఏమో గాని ఇక అక్కడినుండి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పోతున్నాడు. ఏ రకంగా అంటే.. బాలీవుడ్ హీరోలు సైతం ఉలిక్కి పడేలా సినిమాలు చేస్తూ పోతున్నాడు. అవును.. ప్రస్తుతం బాలీవుడ్లో ఖాన్ ల కంటే కూడా ప్రభాస్ కే ఎక్కువ క్రేజ్ వుంది అనడంలో అతిశయోక్తి లేదు.

Prabhas: ప్రభాస్ హాలీవుడ్ కహానీ ఇదే…

Prabhas

ప్రభాస్ నాగ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అనే విషయం తెలిసినదే కదా. ఈ సినిమాకు అశ్విన్ మామ అయినటువంటి ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ విషయమై తాజాగా ఓ వేలాఖరి ఆయన్ని ప్రశ్నించగా.. వారి కాంబినేషన్ సినిమా మామ్మూలుగా వుండదని, అదొక విజువల్ వండర్ కాబోతుందని, ఆ సినిమా తరువాత ప్రభాస్ హాలీవుడ్ కి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాలు ఇవే..

ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలతో బిజీ బిజీగా వున్న సంగతి మనకు తెలిసినదే. దానితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ‘ప్రాజెక్ట్ కే’ అనే సినిమా కూడా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇకపోతే ఈ సినిమాలన్నీ పూర్తైన తరువాత సెన్సేషనల్ దర్శకుడు సందీప్ వంగ సారధ్యంలో ‘స్పిరిట్’ అనే చిత్రంలో నటించబోతున్నాడు.


Share

Related posts

Breaking: కొత్త చీఫ్ సెక్రటరీని నియమించిన ఏపీ ప్రభుత్వం..!!

P Sekhar

ఎన్ఎస్ఈ చైర్మన్ అశోక్ చావ్లా రాజీనామా

somaraju sharma

అల్లు అర్జున్ అభిమానులు గర్వపడే న్యూస్ ఇది.. ఎంత ఘనత సాధించాడంటే!

Ram