Salaar : సలార్ తో ప్రశాంత్ నీల్ భారీ సర్ప్రైజ్ ఇస్తాడని కొన్ని గంటల క్రితం డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరూ భావించారు. భారీ యాక్షన్స్ డ్రామాగా తెరకెక్కుతున్న సలార్ సినిమా రిలీజ్ డేట్ ని తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ని ఈ సినిమాలో ఎంత పవర్ ఫుల్ రోల్ లో చూపించబోతున్నాడు. ఇప్పటికే సలార్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకోగా ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన మరో పోస్టర్ సినిమా రేంజ్ ఏంటో హింట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్.
గత నెలలో సెట్స్ మీదకి వచ్చిన సలార్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రామగుండం కోల్ మైన్ లో జరిగింది. ఇక తాజాగా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోందట. ప్రస్తుతం ప్రభాస్ తో పాటు శృతి హాసన్ ల మీద కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. అయితే సలార్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఒక న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ ని బాగా ఉత్సాహపరచింది. అదే ఈ సినిమా 2021 లోపే రిలీజ్ అవుతుందన్న న్యూస్. ప్రభాస్ సలార్ కోసం బల్క్ గా డేట్స్ ఇచ్చాడని .. ప్రశాంత్ నీల్ కూడా కేవలం 4 నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని డిసైడయ్యాడని వార్తలు వచ్చాయి.
Salaar : సలార్ న్యూస్ పెద్ద డిసప్పాయింట్ అని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారట..?
కాని తాజా పోస్టర్ తో డార్లింగ్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు ప్రేక్షకులను గట్టి షాక్ తగిలింది. ఈ ఏడాదిలోనో లేక 2022 సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ఆశపడ్డ ఫ్యాన్స్ కి నీళ్ళు చల్లినట్టైంది. మేకర్స్ ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ న్యూస్ పెద్ద డిసప్పాయింట్ అని అంటున్నారు. ఇక ఈ ఏడాది జూలై 30 న దేశ వ్యాప్తంగా రాధే శ్యాం రిలీజవబోతోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!