నేలపై  పడుకోవడం మంచిదా? కాదా ?

నేలపై  పడుకోవడం మంచిదా? కాదా ?
Share

Sleeping:నేలపై పడుకోవడం మొదలు పెట్టిన  తర్వాత చాలా మందికి వెన్ను నొప్పి తగ్గింది అని అంటుంటారు. ఇంకొందరు కింద పడుకోవడం వలన  వెన్ను నొప్పి వస్తుందని లేదా ఎక్కువ అవుతుందని తెలియచేస్తున్నారు. నేలకి దగ్గరగా ఉండటం అంటే దుమ్ము మరియు ధూళి దగ్గరగా ఉండటం వలన అలెర్జీ  లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

pros-and-cons-of-sleeping-on-the-floor
pros-and-cons-of-sleeping-on-the-floor

అలెర్జీ తో బాధపడుతున్న వారు నేలపై పడుకుంటే…  తుమ్ములు ,దురద, ముక్కు కారటం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతాయి. నేలపై ఉపయోగించే దుప్పట్లు మరియు పరుపుల లో నల్లులు( బెడ్‌బగ్)  ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి, కాస్త మందపాటి చాపలను వాడడం మంచిది. అలాగే నేలపై చాప వేసుకొని పడుకోవడం  వల్ల గాలి సరిగా అందకపోవడం  వల్ల చెమట పట్టి అది  అసహ్యకరమైన వాసన వచ్చేలా చేస్తుంది . అలాగే, రక్తహీనత లేదా డయాబెటిస్ వంటి రక్త ప్రసరణను ప్రభావితం చేసే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు..  నేలపై పడుకోవడం వల్ల సమస్యలు ఎదురవుతాయి .

గట్టిగా ఉండే నేల మీద పడుకోవడం  వల్ల  కొన్నిసార్లు రక్త ప్రసరణ  తగ్గే అవకాశం ఉంది. శరీరంలోని పిరుదులు, భుజాలు మరియు దిగువ కాళ్ళు వంటి భాగాల మీద  అదనపు ఒత్తిడి రక్త ప్రవాహాన్ని పరిమితం చేసే అవకాశం ఉంది. అలాగే వృద్ధులు, గర్భిణీలు, ఊబకాయులు నేలపై పడుకోవడం వలన అనేక  సమస్యలు  వస్తాయి.
అయితే నేల మీద పడుకుంటే ఈ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి..రెడీమేడ్ గా దొరికే మ్యాట్రెపరుపులపై న పడుకుంటే, శరీరం దానికి తగ్గట్టుగా అడ్జెస్ట్ అవ్వాల్సి వస్తుంది. అదే నేలపై పడుకుంటే  మాత్రం శరీరమంతా చాలా విశ్రాంతి పొందినట్టు ఉంటుంది. అలాగే ఒత్తిడి కూడాపోతుంది.
నేల పై దిండు లేకుండా గ్రౌండ్ పై వెల్లకిలా పడుకుంటే.. తల, మెడ, వెన్నెముక, హిప్స్.. శరీరం మొత్తానికి ఉపశమనం కలుగుతుంది . అలాగే ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి .. నేల మీద  పడుకోవడం వలన ఉపయోగాలు, నష్టాలు రెండు ఉన్నాయి  కాబట్టి ఎవరి ఒంటి తీరు ను బట్టి  వారు చేయడం మంచిది .

Share

Related posts

భయమే వ్యాపారం.. వచ్చేసింది మందుల మాఫియా.. !!

somaraju sharma

ఎజెండా స్క్రీనింగ్ సమావేశం

somaraju sharma

కోవిడ్ లక్షణాల కీ మలేరియా లక్షణాల కీ తేడా ఇదే !

Kumar