NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

కరోనానే కాదు… దేశంలో ఇదీ పెరుగుతుంది…! మీకేమైనా అర్ధమవుతుందా..??

దేశమంతటా కరోనా కలవరపెడుతుంది…! రోగుల సంఖ్యా భారీగా పెరుగుతుంది…! రోజుకి 20 వేల కేసులకు చేరువయ్యింది…! కరోనా భయం వెంటాడుతుంది. పల్లె, పట్టణం తేడా లేకుండా వైరస్ వేటాడుతుంది. కదా…!! మోడీ, కేసీఆర్, జగన్, చంద్రబాబు, రాహుల్ గాంధీ… పాపం దేశంలో ప్రతీ నాయకుడి బాధ ఇదే. ఈ పెరుగుదల మధ్య దేశంలో మరో పెరుగుదలని మర్చిపోయినట్టున్నారు. ఇటు జనం, అటు నాయకులకు కరోనానే కీలక టాపిక్ గా ఉండగా.., మోడీకి మాత్రం కరోనా కాకుండా పెట్రొల్ ఆదాయం అంశం ముఖ్యంగా మారింది. అందుకే అంతర్జీతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా ఇక్కడ మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.

పెరుగుదల ఇలా…!

పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకి పెరుగుతుంది. ఈ పెరుగుదల కూడా నొప్పి తెలియకుండా రోజుకి 50 , 60 పైసలు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ నెల 8 నాటికి ఉన్న ధరల కంటే ప్రస్తుతం లీటర్ పై రూ. 10 పెరిగింది. 2014 లో బ్యారెల్ చమురు ధర 108 డాలర్లు… అప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ. 77 .. ఇప్పుడు బ్యారెల్ చమురు ధర 42 డాలర్లు. కానీ నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు 2014 లాగానే ఉన్నాయి. 75 నుండి 80 ఉండగా… అప్పుడు, ఇప్పుడు అదే ధర ఉంది. ముడి చమురు ధర 60 శాతం తగ్గినా పెట్రోల్ థలా మాత్రం రూపాయి కూడా తగ్గలేదు. తిరిగి పెరుగుతుంది. దీనికి ఏకైక కారణం పెన్నులు రూపంలో పెంచుతుండడమే. సుంకం అప్పటికీ ఇప్పటికీ 800 శాతం పెంచుకుంటూ పోయారు. ఇది మోడీ గారి దెబ్బ. ఆదాయం కోసం, దేశం ఆర్ధిక బాగోగులు పేరిట పెద్ద, మధ్య తరగతి నుండి పిండుతున్న పద్ధతి ఇదీ.

ఎవ్వరూ నోరు మెదపరేంటి..??

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. మరి ఏ ఒక్కరూ మాట్లాడారేంటి..? జగన్ ఏమయ్యారు..? మోడీపై అప్పుడప్పుడూ ఒంటికాలిపై లేచే కేసీఆర్ కి ఏమైంది..? మోడీని పర్సనల్ గానూ టార్గెట్ చేసిన చంద్రబాబుకి ఇప్పుడు ఏమైంది..?? రాహుల్ గాంధీ ఏమయ్యారు? వామ పక్షాలు ఏమయ్యాయి..??? ఎవ్వరూ ఆందోళనలకు దిగడం లేదు, నేరుగా విమర్శలకు దిగడం లేదు. మోడీని పన్నెత్తి మాట అనడం లేదు. పాపం… దేశంలో కరోనాతో పాటూ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి లేదో అర్ధమవుతుందో లేదో…!! మోడీని విమర్శించే ధైర్యం ఎవరికీ లేదు. ఒకవేళ విమర్శించినా వారు దెస ద్రోహులుగా మిగిలే అవకాశం ఉంది.

పాపం “ఎవరి అవసరాలు వారివి..!!

పెట్రోల్ ధరలు పెంపుని విమర్శించాలి అంటే మోడీ నిర్ణయాలని తప్పు పట్టాలి. అంటే మోడీని ఢీకొట్టాలి. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల్లో మోడీ నిర్ణయాన్ని ఎవరు తప్పు పట్టినా… వారిని ప్రశాంతంగా ఉంచే పరిస్థితి లేదు. అందులోకి ప్రస్తుత నాయకుల్లో ఎవరి అవసరాలు వారికున్నాయి. మోడీతో కొన్ని చీకటి పనులున్నాయి. నిర్మాణాత్మక విమర్శలు చేయాలన్నా భయపడే స్థితి వచ్చింది. ఎవరి పనులు వారికున్నాయి, ఎవరి అవసరాలు వారికున్నాయి. అందుకే మోడీ ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా పరోక్షంగా భజన చేయడమే. పేదోళ్లపై భారం నెట్టడమే.

author avatar
Srinivas Manem

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju