Raghava Lawrence: కొరియోగ్రాఫర్‌గా సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్. సైడ్ డాన్సర్‌గా ఉన్న లారెన్స్ లోని టాలెంట్ గుర్తించిన మెగాస్టార్ చిరంజీవి ఆయన హీరోగా నటించిన సినిమాకి అవకాశం ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ముఠామేస్త్రి అనే సినిమా చేశారు. ఇందులో మీనా, రోజా హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాలో ఈ పేటకి నేనే మేస్తిరీ అనే సాంగ్ ఉంటుంది. ఇందులో గ్రూప్ డాన్సర్స్‌లో ఎక్కడో నాలుగో లైన్లో అందరి కంటే హుషారుగా స్టెప్పులేస్తూ చిరంజీవిని ఇంప్రెస్ చేశాడు.
దాంతో ఆయన తన నెక్స్ట్ సినిమాకి కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇస్తానని మాట ఇచ్చారు. అలా హిట్లర్ సినిమాలో ఉన్న సూపర్ హిట్ సాంగ్ అబిబీ అబీబీ సాంగ్‌కి కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చారు. ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందని మెచ్చుకున్న మెగాస్టార్ ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన మాస్టర్ సినిమాకి కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చారు. ఇందులో సాంగ్స్ కూడా బాగా కంపోజ్ చేయడంతో ఇక కొరియోగ్రాఫర్‌గా లారెన్స్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ముఖ్యంగా ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఖచ్చితంగా ఒక్క పాటకైనా లారెన్స్ డాన్స్ కొరియోగ్రఫీ ఉండాల్సిందే.
Raghava Lawrence: మెగాస్టార్‌కి అది సెంటిమెంట్ కూడా.
మెగాస్టార్‌కి అది సెంటిమెంట్ కూడా. ఆయన సినిమాకి దాదాపు ఇంట్రో సాంగ్ లారెన్స్ కొరియోగ్రఫీ చేస్తే సినిమా సూపర్ హిట్ అని ఫిక్స్ అవుతారు. అలా ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో లారెన్స్ డాన్స్ మాస్టర్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ క్రేజ్‌తో దర్శకుడిగా మారాలనుకున్నారు లారెన్స్. అలా మాస్ అనే మాస్ ఎంటర్టైనర్ని తెరకెక్కించేందుకు కథ సిద్దం చేసుకొని నాగార్జునకి వినిపించాడు. ఈ కథ నాగార్జునకి విపరీతంగా నచ్చడంతో లారెన్స్‌కి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు.
నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై మాస్ సినిమాను తెరకెక్కించిన లారెన్స్ దర్శకుడిగా భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగానూ ఇండస్ట్రీలో అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత స్టైల్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా మంచి కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఇదే క్రమంలో ముని అనే హరర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో సినిమాతో దర్శకుడిగా మంచి హిట్ సాధించాడు. ఇలా దర్శకుడిగా వరుస హిట్స్ అందుకుంటున్న లారెన్స్ మరోసారి నాగార్జునతో డాన్స్ అనే సినిమాను తీశాడు. ఇందులో ఆయన తమ్ముడిగానూ నటించాడు.
Raghava Lawrence: సక్సెస్ ట్రాక్ చూసి ప్రభాస్ లారెన్స్‌కి అవకాశం ఇచ్చాడు.
ఈ సక్సెస్ ట్రాక్ చూసి ప్రభాస్ లారెన్స్‌కి అవకాశం ఇచ్చాడు. రెబల్ అనే టైటిల్‌తో లారెన్స్ ఈ సినిమాను తెరకెక్కించాడు. శ్రీబాలాజీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ ఈ సినిమాను నిర్మించారు. అయితే మాస్, డాన్స్ సినిమాల మాదిరిగానే కథ ఉండటంతో జనాలకి పెద్దగా సినిమా నచ్చలేదు. ఇందులో ఉన్న ఒకే ఒక్క ఫైట్ తప్ప సినిమాలో కథ అంటూ ఏదీ లేదని అందరూ మాట్లాడుకున్నారు. ఇక ముందు అనుకున్న బడ్జెట్ కంటే రెట్టింపు కావడంతో నిర్మాతలకి చాలా నష్టం వాటిల్లింది.
రెబల్ సినిమా ఫ్లాప్‌గా మిగిలి లారెన్స్ విమర్శలు ఎదుర్కున్నారు. చెప్పాలంటే ఈ సినిమా తర్వాత నిర్మాతలు మళ్ళీ సినిమా చేయడానికి చాలా ఏళ్లు పట్టింది. అలా లారెన్స్ ..ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం అందుకొని కూడా హిట్ ఇవ్వలేకపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన వేరే హీరోలతో సినిమాలను తెరకెక్కించడం లేదు. ముని సిరీస్‌లో భాగంగా కాంచన, కాంచన 2, గంగ, శివ లింగ ఇలా కామెడీ హర్రర్ బ్యాక్ డ్రాప్లో సినిమాలను తీస్తూ వాటిలో ఆయనే నటిస్తూ హిట్స్ అందుకుంటున్నాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!