NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Rahul Gandhi: తెలంగాణలో కుటుంబ పాలనకు ఇకనైనా స్వస్తి పలకాలి – రాహుల్ గాంధీ

Share

Rahul Gandhi: తెలంగాణలో కేసిఆర్ కుటుంబ పాలనకు ఇకనైనా స్వస్తి పలకాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్రలో భాగంగా రెండో రోజు భూపాలపల్లి నుండి పెద్దపల్లి వరకూ సాగింది. మంథని, కాటారం, పెద్దపల్లి తదితర ప్రాంతాల సభల్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉందని ఆరోపించారు. అవినీతి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం కేసిఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ విచారణ ఎందుకు జరపట్లేదని ప్రశ్నించారు. దొరల తెలంగాణ – ప్రజల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరగనున్నాయన్నారు.

పదేళ్లుగా కేసిఆర్ ప్రజలకు దూరం అవుతూ వస్తున్నారన్నారు రాహుల్ గాంధీ. తెలంగాణలో అధికారం కుటుంబానికే పరిమితమైందని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో కేసిఆర్ ఇచ్చిన హామీ లను గుర్తు చేస్తూ అవి నెరవేరాయా అని ప్రశ్నించారు. బీజేపీపై కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో అభ్యర్ధులను పోటీ పెట్టి బీజేపీకి సహకరిస్తొందని అన్నారు. బీజేపీ తెచ్చిన ప్రతి చట్టానికి బీఆర్ఎస్ మద్దతు పలికిందని, చివరకు రైతు చట్టాలకు కూడా మద్దతు తెలిపిందన్నారు. తెలంగాణలో త్వరలో పేదలు, రైతుల సర్కార్ ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం ఆయన పరివారం సంపదను ఎలా దోచుకుందో ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు.

అర్హులైన మహిళల ఖాతాల్లో ప్రతి నెలా రూ.2,500 వేస్తామనీ, రూ.500లకే గ్యాస్ సిలెండర్ అందిస్తామని, రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ నిలబెట్టుకుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో కేవలం 5 శాతం అధికారులు మాత్రమే బడ్జెట్ ను నియంత్రిస్తున్నారని అన్నారు. అందరికీ పరిపాలనలో భాగస్వామ్యం చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆదానీ లక్షల కోట్ల రూపాయల అప్పును బీజేపీ సర్కార్ మాఫీ చేస్తొందని, స్వయం ఉపాధి కింద మహిళలు తీసుకున్న రుణాలను మాత్రం మాఫీ చేయట్లేదని ఆరోపించారు.

ప్రజల నుండి వసూలు చేసిన పన్నుల మొత్తాన్ని అదానీకి బీజేపీ కట్టబెడుతోందని రాహుల్ ఆరోపించారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని బీఆర్ఎస్ తోనే ఎంఐఎం ఉందని విమర్శించారు. తాను బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాను కాబట్టే ఎన్నో కేసులు పెట్టారన్నారు.  తెలంగాణ ముఖ్యమంత్రి బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కాబట్టే ఆయన వెంట సీబీఐ, ఈడీలు పడవని అన్నారు.  రాష్ట్రం వచ్చి పదేళ్లు గడిచినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ధరణి పోర్టల్ వల్ల ఎవరికైనా మేలు జరిగిందా అని ప్రశ్నించారు.

ధరణి పోర్టల్ ద్వారా రికార్డులు మార్చి భూములు లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు. సింగరేణి గనులను ఆదానీకి అమ్మే ప్రయత్నం జరిగితే తాము అడ్డుపడతామని, సింగరేణి ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ. ఆరు గ్యారెంటీలను అమలు చేసి తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు రాహుల్ గాంధీ. ప్రజలు చూపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే కేసిఆర్ ఓటమి ఖాయంగా కనిపిస్తొందని అన్నారు.  తొలుత భూపాల్ పల్లిలో రాహుల్ గాంధీ నేతలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. రాహుల్ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితర ముఖ్య నేతలు రాహుల్ వెంట పాల్గొన్నారు.

CM YS Jagan: నాటి బాబు పాలన, నేటి మీ బిడ్డ పాలనను ప్రజలు బేరీజు వేసుకుని మద్దతు ఇవ్వాలని కోరిన సీఎం జగన్


Share

Related posts

Telangana Election: మునుగోడు కాంగ్రెస్‌కి బిగ్ ఝలక్ .. పార్టీకి పాల్వాయి స్రవంతి రెడ్డి రాజీనామా

somaraju sharma

Samantha: ఆ ముగ్గురు ఇష్టమని నిర్మొహమాటంగా మనసులో మాట బయట పెట్టిన సమంత..!!

sekhar

విజయవాడ ప్రమాదం లోగుట్టు ఎవరికెరుక..?

Muraliak