Raj Kundra: రాజ్ కుంద్రా సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ చేయడానికి కారణం అదేనా…?

Share

Raj Kundra: బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ కుంద్రా పేరు వినబడగానే అందరూ నటి శిల్పాశెట్టి భర్త అని మాట్లాడుకుంటారు. కానీ శిల్పాశెట్టి(Shilpa Shetty) భర్త అవ్వకముందు అతనొక సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ అని ఎవరికీ తెలియకపోవచ్చు. అతనొక బ్రిటీష్ ఇండియన్ బిజినెస్ మ్యాన్. 2004 లెక్కల ప్రకారం ఏషియాలోనే రిచెస్ట్ పర్సన్స్ లిస్టులో 198వ స్థానంలో రాజ్‌కుంద్రా నిలిచారు.ఐపీఎల్ సీజన్ ప్రారంభం అయ్యాక రాజస్థాన్ రాయల్స్ జట్టును కొనుగోలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. తన భార్య శిల్పాశెట్టి యోగా ద్వారా ఫిట్‌నెస్‌ ఐకాన్‌గా మారి అందరికీ దగ్గరైంది. రాజ్ కుంద్రా సినిమాలు, బిజినెస్, ఐపీఎల్ ఇలా అన్నింటిని చూసుకునేవారు. ఇటీవల పోర్న్ వీడియో కేసులో అరెస్టు అయిన కుంద్రా రెండు నెలల పాటు జైలు జీవితం గడిపారు. తాజాగా బెయిల్ మీద విడుదల అయ్యారు.

ట్విట్టర్, ఇన్ స్టా అకౌంట్లు పర్మినెంట్‌గా డిలీట్..

ఇంటికి చేరుకున్నాక రాజ్ కుంద్రా తన మునుపటి రోజులను పూర్తిగా మర్చిపోయినట్టు తెలుస్తోంది. తన భార్య శిల్పతో కలిసి సరదాగా గడుపుతున్నారు. అంతకుముందు రాజ్‌కుంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. తన భార్యతో కలిసి ప్రతీ విషయాన్ని అభిమానులతో పంచుకునే వారు. పోర్న్ కేసులో అరెస్టు అయ్యి వచ్చాక తన ‘ట్విట్టర్(Twitter), ఇన్ స్టా(Instagram)’ అకౌంట్లను కుంద్రా పర్మినెంట్‌గా డిలీట్ చేశారు. కారణం అతను పలు అభియోగాలను ఎదుర్కొంటూ జూలై నెలలో అరెస్టు అయ్యి.. జైలు జీవనం గడపడమే కారణంగా తెలుస్తోంది. ఈ సమయంలో తాను ఏదైనా పోస్టు పెడితే అభిమానుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని ముందస్తుగా సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేసినట్టు ప్రచారం సాగుతోంది.

విడాకుల‌పై రూమ‌ర్లు..

అయితే, కుంద్రా అరెస్టు తర్వాత శిల్పాశెట్టి చాలా బాధపడ్డారు. విచారణ అధికారులు ఆమెను ప్రశ్నల పేరుతో ఇబ్బందులకు గురిచేసినట్టు అప్పట్లో జోరుగా వార్తలొచ్చాయి. తన భర్త ఇలాంటి కేసులో ఇరుక్కోవడంతో తన పరువుకు ఎలాంటి భంగం కలుగకుండా కుంద్రా నుంచి విడాకులు తీసుకుంటుందని జోరుగా చర్చలు సాగాయి. కానీ శిల్పా అందుకు సిద్ధపడలేదని తెలిసింది. ఎట్టకేలకు కుంద్రా తిరిగి రావడంతో భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. నటి షెర్లిన్ చోప్రా(Sherlyn Chopra) కుంద్రాపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగానే ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చిందని అంతా భావించారు. తనను వాడుకుని వదిలేశారని, పోర్న్ వీడియోల్లో నటించాలని రాజ్ కుంద్రా తనను పలుమార్లు ఒత్తిడికి గురిచేశారని షెర్లిన్ చోప్రొ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన జైలు జీవనం గడపాల్సి వచ్చింది.


Share

Related posts

ఆ వీడియో చూసి కన్నీళ్లు పెట్టుకున్న పూరీ జగన్నాథ్..!

Teja

దేశంలో మూడవ ర్యాంక్ సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..!!

sekhar

Bigg Boss 5 Telugu: ఏడవ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ జరగకముందే.. ఆ కంటెస్టెంట్ హౌస్ నుండి అవుట్..??

sekhar