Rajanikanth: రజనీకాంత్‌కి దెబ్బ మీద దెబ్బ తగుతున్నా..క్రేజ్ డబుల్ అవుతోంది..

Share

Rajanikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బస్ కండెక్టర్ స్థాయి నుంచి కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఓ సూపర్ స్టార్‌గా ఎదిగే స్థాయికి చేరుకున్నారు. ఈ క్రేజ్ సంపాదించడం అంటే కలలో కూడా ఎవరూ ఊహించలేరు. దీనికి రజనీ పట్టుదల సినిమా మీద ఉన్న ప్రేమ గౌరవమే అని చెప్పాలి. అగ్ర దర్శకులతో పని చేసి సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయే పేరు సంపాదించుకున్నారు. ఆయన వయసుకి మించిన పాత్రలు చేశారు.

rajanikanth-craze is doubled
rajanikanth-craze is doubled

ఇప్పుడు ఆ వయసు సగం కనిపించే పాత్రల్లోనూ నటిస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో తలైవర్‌గా రజనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అసాధారణం. ఆయన సినిమా వస్తుందంటే స్కూల్స్, కాలేజెస్, ఇండస్ట్రీస్, బిజినెస్ ఇలా మొత్తం బంద్ పెట్టాల్సిందే. అంతేకాదు కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకి సెలవు ప్రకటించడమే కాకుండా స్వయంగా షోకి టికెట్స్ కూడా అందివ్వడం ఆసక్తిరమైన విషయం. అంత క్రేజ్ ఉన్న రజనీ తన అభిమానులను అంతే బాగా చూసుకుంటున్నారు. సినిమా రిలీజ్ రోజున థియోటర్స్ వద్ద ఫ్లెక్సీలకి పాలాభిషేకాలు..పెద్ద పెద్దగా సంబరాలతో అభిమానులు హోరెత్తిస్తుంటారు.

Rajanikanth: అదే ఆయన ఆఖరి సినిమా అని ప్రకటించాడు.

అయితే రజనీకాంత్‌ భాషా, బాబా సినిమా తీసిన సందర్భంలో అదే ఆయన ఆఖరి సినిమా అని ప్రకటించాడు. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో ఓ భారీ హిట్ కొట్టి సినిమాలకి బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నట్టు ప్రకటించి మళ్ళీ సినిమాలను చేస్తూ వస్తున్నారు. శివాజీ, లింగ, చంద్రముఖి, కథానాయకుడు సినిమాలు చేసిన రజనీ హిట్స్ తో పాటు ఫ్లాప్స్ కూడా అందుకున్నారు. అయితే భారీ అంచనాల మధ్య యంగ్ డైరెక్టర్ పా.రంజిత్‌తో కబాలి చేశారు. ఈ సినిమా ట్రైలర్‌తో ఊహించని విధంగా అంచనాలు పెరిగాయి.

కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాట లేకపోయింది. అభిమానులు ఎంతో నమ్మకం పెట్టుకుంటే తీవ్రంగా నిరాశపరచింది కబాలి. అయితే దర్శకుడు పా.రంజిత్ మేకింగ్ స్టైల్ రజనీకీ విపరీతంగా నచ్చింది. అందుకే వెంటనే అదే దర్శకుడితో కాలా చేసేందుకు సిద్దమయ్యారు రజనీ. అందరూ నెగిటివ్ గా మాట్లాడినప్పటికీ పా.రంజిత్ తోనే కాలా అనే సినిమా చేశారు. ఈ సినిమా మీద ఏర్పడిన అంచనాలు కూడా భారీ రేంజ్ లోనే. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ కాలా కూడా ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది.

Rajanikanth: రజనీ నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ దెబ్బ మీద దెబ్బ కొట్టాయి.

దాంతో రజనీ పేట అనే సినిమా చేసి హిట్ కొట్టాలనుకున్నారు. అది కూడా ఫ్లాప్ మూవీగా మిగిలింది. దీని తర్వాత వచ్చిన దర్భార్ కూడా రిలీజ్ అయిన అన్నీ భాషలలో ఫ్లాప్ గా మిగిలింది. ఇలా రజనీ నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ దెబ్బ మీద దెబ్బ కొట్టాయి. అయిన రజనీ క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఇక రెమ్యునరేషన్ కూడా భారీగానే పెరిగింది. కోలీవుడ్ యంగ్ హీరోలతో పోటీ పడి వరుసగా సినిమాలు కమిటవుతున్నారు. ప్రస్తుతం ఆయన అణ్ణాత్త అనే సినిమాతో వచ్చేందుకు సిద్దమవుతున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా, ఖుష్బూ, మీనా, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చూడాలి మరి రజనీకాంత్‌కి అణ్ణాత్త అయినా హిట్ ఇస్తుందా లేదా.

 


Share

Related posts

Badvel Bypoll: బద్వేల్ ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు

somaraju sharma

వీడియో లో అనసూయ పరువు తీసిన వర్ష… చివరికి కలిసినప్పుడు…..

arun kanna

లోకో పైలట్ కాలు తొలగింపు

Mahesh