Rajendra prasad : నందమూరి తారకరామారావు స్ఫూర్తితో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రేమించు పెళ్లాడు సినిమాతో హీరోగా మారి జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి వారి దర్శకత్వంలో నటించి హీరో కూడా నవ్వుల్ని పండించగలడు అని నిరూపించి ఒక నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా తన సత్తా చాటాడు. ఇప్పుడు ప్రస్తుతం గాలి సంపత్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో యంగ్ హీరో శ్రీవిష్ణు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తిగా వినోదాత్మక చిత్రంగా రూపొందింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కంప్లీట్ జరుపుకుని విడుదలకు దగ్గరవడంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు.
ఇదిలా ఉండగా తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ వీడియో ట్విట్టర్ వేదికగా షేర్ చేసి రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ ని పరిచయం చేయబోతున్నారు. గాలిసంపత్ సాంగ్స్ టీజర్స్ సోషల్ మీడియాలో ఆల్రెడి బజ్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ వాడే ‘ఫిఫిఫీ ఫిఫిఫీ’ కొత్త లాంగ్వేజ్ ని ప్రయోగించినట్లు తెలుస్తుంది. ఈ భాష ప్రేక్షకులని ఎలా ఆకట్టుకుంటుందో మనమందరం వేచి చూడాల్సిందే. ఆ వీడియోలో రాజేంద్రప్రసాద్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నది కొన్ని సెకనుల నిడివితో ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరలై హల్ చల్ చేస్తుంది.
Rajendra prasad : రాజేంద్రప్రసాద్ ‘ఫిఫీ’ మాడ్యులేషన్ లో డబ్బింగ్ ..!
రాజేంద్రప్రసాద్ కి విలక్షణమైన నటుడు అన్న పేరు ఎలాగో ఉన్నదే. అదే విలక్షణాన్ని మరోసారి ‘ఫిఫీ’ మాడ్యులేషన్ లో డబ్బింగ్ చెబుతు ప్రూవ్ చేసుకున్నారు. తనలో ఉన్న ఈ స్పెషాలిటీయే తనకి సినిమా పట్ల ఉన్న ప్యాషన్ ని తెలియచేస్తుందని దర్శకుడు అనిల్ రావిపూడి రాజేంద్రప్రసాద్ ని పదేపదే కొనియాడారు. ఈ సినిమాకు అనిష్ కృష్ణ దర్శకత్వం వహించగా,ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ అండ్ షైన్ స్క్రీన్స్ బ్యానర్లపై హరీష్ పెద్ది, సాహు గారపాటి, ఎస్. కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ని మహాశివరాత్రి సందర్బంగా మార్చ్ 11న విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!