Rakul Preet Singh : ప్రెసెంట్ జెనరేషన్ లో తెలుగునాట చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ హీరోయిన్ లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. మెల్లగా మొదలైన అమ్మడి ప్రయాణం, ఇక్కడ దాదాపు పెద్ద పెద్ద హీరోల సరసన చేసే స్థాయికి చేరుకుంది. రకుల్ ఓ మొండి పట్టుదల కలిగిన యువతి. అందంతో పాటు అభినయం ఈమె సొంతం. అంతేకాకుండా ఎప్పటికప్పుడు తన బాడీని ఫిట్ గా ఉంచుకుంటూ నూతన స్టార్లకు సవాలు విసురుతోంది. అయితే ప్రస్తతం తెలుగులో ఈ అమ్మడికి అవకాశాలు కాస్త నెమ్మదిస్తున్న తరుణంలో ప్రస్తుతం ముంబైలో కెరీర్ ను వెతుక్కుంటున్నది.
Rakul Preet Singh : రకుల్ బాలీవుడ్ సినిమాలు ఇవే
రకుల్ రీసెంట్ గా జాన్ అబ్రహాం హీరోగా రిలీజైన అటాక్ అనే చిత్రంలో నటించింది. కంప్లైట్ యాక్షన్ కథ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె డాక్టర్ సబా ఖురేషి పాత్రలో నటించింది. ఇవి కాక ఈమె నటించిన రన్ వే 34, మిషన్ సిండ్రెల్లా, డాక్టర్ జి, థాంక్ గాడ్ వంటి మరో 4 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. లాక్ డౌన్ ముందు రకుల్ చేసిన సినిమాలన్నీ ఇప్పుడు రిలీజ్‌కు వరుస క్యూ కట్టడంతో అక్కడ ఈమె పేరు బాగానే వినిపిస్తోంది. ఇక ఇందులో ఎన్ని వుంటాయో, ఎన్ని ఊడుతాయో చూడాలి మరి. ఇక జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద తుస్సుమనడం తెలిసినదే.
రకుల్ నయా ట్రెండ్ డ్రెస్
ఇకపోతే, రకుల్ ఆ మధ్య సడెన్ గా తాను ప్రేమలో వున్న విషయం తెలియజేస్తూ ఒకరిని పరిచయం చేయడం తెలిసిందే. కాగా ఈ జంట త్వరలోనే పెళ్లిపీటలు కూడా ఎక్కనుంది. ఇరు కుటుంబాల సమక్షంలో వీరు త్వరలో ఒక్కటి కాబోతున్నారనేది తెలుస్తోంది. కాగా ప్రేమలో పడిన రకుల్ గ్లామర్ ఇపుడు రెట్టింపు అయ్యింది. గత కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతతో వరుస ఫొటో షూట్స్‌తో హీట్ పుట్టిస్తోంది. ఎంతైనా బాలీవుడ్ గాలి కదా. అలాగే ఉంటుంది మరి అనుకుంటున్నారు నెటిజన్స్.