న్యూస్ సినిమా

రెడ్ ట్రైలర్ చూసి రాం కి ఇండస్ట్రీ హిట్ పక్కా అని ఫిక్సవుతున్న ఫ్యాన్స్ ..!

Share

రెడ్ .. రాం పోతినేని నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్. రెడ్ సినిమాకి ముందు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ మాస్ హిట్ అందుకున్న రాం చాలా కథలు విని ఎట్టకేలకి రీమేక్ సినిమా వైపు మొగ్గు చూపాడు. తమిళం లో భారీ హిట్ అందుకున్న తడం సినిమాని తెలుగులో రెడ్ గా రీమేక్ చేశాడు. ఇంతక ముందు రాం కి నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలతో రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన కిషోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. రాం పెదనాన్న స్రవంతి రవికిషోర్ సొంత బ్యానర్ లో నిర్మించాడు.

RED Teaser Out | Ram Pothineni Looks Promising In Dual Avatar - Filmibeat

కాగా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా రాం కి, అలాగే మేకర్స్ కి ఈ సినిమా మీద ఉన్న గట్టి నమ్మకంతో ఓటీటీ నుంచి భారీ ఆఫర్ వచ్చినా కూడా థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకే వేయిట్ చేశారు. ఎట్టకేలకి ఈ సినిమాని సంక్రాంతి బరిలో దింపాలని రాం డిసైడయినట్టు తెలుస్తోంది. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తన సోలో బ్రతుకే సో బెటర్ అన్న సినిమాతో 25 న థియేటర్స్ లో కి వస్తున్నాడు. అలాగే రవితేజ జనవరి 14 న తన క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అందుకే రాం కూడా తన రెడ్ సినిమాని థియేటర్స్ లోకి సంక్రాంతి పండుగకే తీసుకు రావాలని ప్లాన్స్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ థియేట్రికల్ ట్రైలర్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. డ్యూయల్ రోల్ లో రాం అద్భుతంగా నటించాడని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇక ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడం.. రెడ్ ట్రైలర్ బాగా ఆకట్టుకుంటుండంతో ఫ్యాన్స్ పక్కా రాం కి రెడ్ సినిమాతో మరో భారీ హిట్ పడబోతోందని ఫిక్సైయ్యారట. నివేతా పేతురాజ్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నారు.


Share

Related posts

రామోజీరావు ఇంత అన్యాయం చేశారా… మరి దీనికి పరిష్కారం ఏమిటి?

arun kanna

Pavithra Lakshmi Amazing Looks

Gallery Desk

పాలు తాగడం ఇష్టపడని పిల్లలు ఉంటే ఇది తాగించండి !!

Kumar