NewsOrbit
న్యూస్

కేసీఆర్ సొంత టీం లోనే సీక్రెట్ మిస్సైల్స్ ని పంపిన రేవంత్… ఇది సూపర్ డూపర్ ప్లానింగ్!

చెప్పులోని రాయి, చెవులోని జోరీగ, కంటిలోని నలుసు, కాలి ముళ్లు, రేవంత్ పోరు ఇంతింత కాదయా… ప్రస్తుతం కేసీఆర్ ఈ పద్యాన్ని పాడుకోవాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డి కల్పించాడన్న అతిశయోక్తి కాదేమో! ప్రస్తుతం రాజకీయంగా ఎలాంటి ఇబ్బందీ లేకుండా దూసుకుపోతున్న కేసీఆర్ కు నిజంగానే రేవం చాలా ఇబ్బందిగా తయారయ్యారని అంటున్నారు విశ్లేషకులు. ఉదాహరణకు మొన్న జరిగిన ఈట్ల రాజేందర్ వ్యవహారమే చూసుకుంటే గనుక… రేవంత్ పేల్చిన బాంబు కొత్త అనుమానాలకు తావిస్తోందనే చెప్పాలి.

కరోనా విషయంలో కేసీఆర్ సర్కార్ ఫెయిల్యూర్స్ కి ఈటల ను బలిపశువును చేయబోతున్నారని, ఆయనని కేబినెట్ నుంచి తొలగించడానికి కేసీఆర్ కరోనాను వాడుకుంటున్నారని చెప్పిన రేవంత్… ఆ విషయం తనకు టీఆర్ ఎస్ కు చెందిన మిత్రుడే చెప్పారని పెద్ద బాంబే పేల్చారు. దీంతో తెరాస అధినాయకత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడిందనే చెప్పొచ్చు. ఆ సంగతి అలా ఉంటే… మరో విషయంలో కూడా కేసీఆర్ కు వరుస షాక్ ఇచ్చారు రేవంత్.

కోరోనా వచ్చిన మొదట్లో కేసీఆర్ ఒక సంచలన ప్రకటన చేశాడు. హైదరాబాదుకు చుట్టు ఒక్కో ఆస్పత్రిని ఘనంగా నిర్మించుకుందాం. గచ్చిబౌలిలో టిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం అని ప్రకటించారు. ఏప్రిల్ లో దీన్ని ప్రారంభం కూడా చేశారు. పది వేల కేసులు వచ్చినా తట్టుకునే స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని.. ఆందోళన చెందాల్సిన పనిలేదని ఈ సందర్భంగా కేసీఆర్ ఘనంగా ప్రకటించారు. ఈ క్రమంలో కరోనా తీవ్రత పెరగటం.. గాంధీలో పేషెంట్లు నిండిపోవడంతో నిమ్స్ ను కోవిడ్ ఆస్పత్రిగా మార్చడంతో… “టిమ్స్” ఏమైందని చాలామందిలో అనుమానం వచ్చింది. ఈక్రమంలోనే ఎంపీ రేవంత్ రెడ్డి టిమ్స్ ను ఆకస్మికంగా సందర్శించారు.

అనంతరం స్పందించిన రేవంత్… “అక్కడ ఎటువంటి ఆస్పత్రి సదుపాయాలు లేవు.. నలుగురు సెక్యూరిటీ మాత్రమే ఉన్నారు.. ఇదీ మన ముఖ్యమంత్రి మాటల గారడీ.. ఆయనలో గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ ఉండదు. టిమ్స్ గురించి అంత గొప్పగా చెప్పాడు? చివరకు నిమ్స్ మీద ఆధారపడ్డారు.. అంత ఘనంగా ప్రచారం చేసుకుని మీడియాలో రాయించుకున్నాడు… ఈ ఆస్పత్రికి కనీసం డ్రైనేజీ కూడా లేదు” అని ఫైరయ్యారు. వెంటనే… టిమ్స్ ఆస్ప‌త్రిలో సిబ్బంది నియామకానికి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది తెలంగాణ సర్కార్. ఇప్పుడు దీనిపైనే అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియా మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

రేవంత్ పర్యటించారు, వాస్తవాలు బయటపెట్టారు కాబట్టి… టిమ్స్ విషయంలో ప్రభుత్వం స్పందించి, నియామకానికి నోటిఫికేషన్ విడలచేసిందా..? లేక ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయబోతోందని ముందే తెలిసి రేవంత్ ఆ ఆస్పత్రిని సందర్శించడానికి వెళ్లారా? అని! రెండింటిలో ఏది జరిగినా ఆ క్రెడిట్ రేవంత్ కే అనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. అంటే… రేవంత్ కు కేసీఆర్ టీం లో కోవర్టులు ఉన్నారా అని! కేసీఆర్ సొంత టీం లోకే రేవంత్.. సీక్రెట్ మిస్సైల్స్ ని పంపి సూపర్ డూపర్ ప్లాన్ చేశారా అని! ఏది ఏమైనా… రేవంత్ మాత్రం కేసీఆర్ కు కంటిలోని నలుసుగా మారరనడంలో ఎలాంటీ సందేహం అక్కరలేదేమో అని అభిప్రాయాలకు బలం చేకూరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు!

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju