RRR: ప్ర‌మోష‌న్‌లో భాగంగా NTRను ఉద్దేశించి ఎమోషనల్ అయిన చరణ్!

Share

NTR Ram Charan: ఇండియాలో సినీ పరిశ్రమలన్నీ ఇప్పుడు ‘RRR’ వైపే చూస్తున్నాయి. బాహుబలి తరువాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. డీవీవీ దానయ్య ఈ సినిమాను సుమారు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఎన్టీఆర్ – చరణ్ చాలా బలమైన పాత్రలను పోషించారు. బాలీవుడ్ నుండి అజయ్ దేవగన్, అలియా భట్, హాలీవుడ్ నుండి ఒలీవియా మోరిస్, ఇలా అన్ని సినీ పరిశ్రమలనుండి ప్రముఖులను ఈ సినిమాకోసం కాస్ట్ చేసారు జక్కన. అందువలన సహజంగానే ఈ సినిమాపైన అంచనాలు భారీగానే నెలకొన్నాయి.

ఈ వేదికమీదే చరణ్ చాలా ఎమోషనల్ అయ్యారు!

ఈ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేసారు చిత్ర యూనిట్. ఈ ప్రమోషన్స్ లో భాగంగా మొన్న ముంబైలో జరిగిన ఈవెంట్ గురించి మనకు తెలిసినదే. ఈ కోవలోనే నిన్న అనగా డిసెంబర్ 27న చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా హాట్టహాసంగా జరిపారు. దీనికి ఉదయనిధి స్టాలిన్, శివ కార్తికేయన్ గౌరవ అతిథులుగా వచ్చి సందడి చేసారు. ఇక ఈ వేదికపై అనేకమంది మాట్లాడిన తరువాత చరణ్ మైక్ అందుకొని ఇలా మాట్లాడారు.

NTRని ఉద్దేశిస్తూ.. చరణ్ మాట్లాడిన మాటలు ఇవే..

చరణ్ అందరికీ థాంక్స్ చెప్పిన తరువాత చివరగా NTRని ఉద్దేశిస్తూ.. “వయసులో తారక్ కి నాకు మధ్య ఒక సంవత్సరం మాత్రమే తేడా. స్నేహంలో ఎటువంటి తేడా లేదు. నేను తారక్ కి థ్యాంక్స్ చెప్పదలచుకోలేదు. ఎందుకంటే అలా చెబితే ఆయనతో ఉన్న స్నేహ బంధానికి ముగింపు పలికినట్టుగా అవుతుంది. తారక్ లాంటి సోదరుడిని ఇచ్చినందుకు నేను ఆ దేవుడికి ముందు థ్యాంక్స్ చెబుతున్నాను.” అని తన స్పీచ్ ని ముగించాడు. దాంతో NTR చాలా ఎమోషనల్ అయ్యాడు. అలాగే ఆ మాటలకు అక్కడి అభిమానులంతా ఈలలతో గోల చేశారు.


Share

Related posts

ప్రధానిని వెంటాడుతున్న పాత ట్వీట్ !

Yandamuri

మా మీద దాడి కుట్ర బయటపడాలంటే పిన్నెల్లి కాల్ డేటా ను బయటపెట్టండి : బొండా ఉమా ఫైర్

Siva Prasad

Sreemukhi Goa Trip Photos

Gallery Desk