NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Ukraine War: యుద్ధం మొదలైంది…ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ ప్రపంచ దేశాలకు పుతిన్ హెచ్చిరిక..

Ukraine War:  అందరూ భయపడినట్లే జరిగింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్ పై రష్యా మిలిటరీ ఆపరేషన్ మొదలు పెట్టింది. బాంబుల మోతో ఉక్రెయిన్ దద్దరిల్లుతోంది. ప్రపంచ దేశాలు యుద్దం వద్దని వారిస్తున్నా రష్యా పట్టించుకోకుండా యుద్ధానికే మొగ్గు చూపింది. ఉక్రెయిన్ పై మిలిటరీ ఆపరేషన్ చేపడుతున్నట్లు రష్యా అధినేత పుతిన్ అధికారికంగా ప్రకటించారు. తమకు మిలటరీపరమన సహాయం చేయాలంటూ ఉక్రెయిన్ వేర్పాటువాదులు విజ్ఞప్తి చేసిన తరువాత రష్యా నుండి యుద్ధ ప్రకటన వెలువడింది. నిన్న రాత్రి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉద్వేగ భూరితంగా రష్యాకి విజ్ఞప్తి చేశారు. యూరప్ లో పెద్ద యుద్ధానికి తెరతీయవద్దని కోరారు. ఉక్రెయిన్ లో రష్యా జాతి ప్రజలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. పుతిన్ తో మాట్లాడేందుకు తాను ప్రయత్నించాననీ కానీ పుతిన్ నుండి స్పందన లేదని అన్నారు.

Russia Declares War on Ukraine
Russia Declares War on Ukraine

Ukraine War: ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం

రష్యా కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు పుతిన్ యుద్ధ ప్రకటన చేశారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్ ను కట్టడి చేయడమే తమ ముందు ఉన్న లక్ష్యమని పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ ను ఆక్రమించాలన్న ఉద్దేశం తమకు లేకపోయినా ఆ దేశం నుండి ఎదురవుతున్న ముప్పును ప్రతిఘటనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పుతిన్ ప్రకటించారు. రక్తపాతం జరిగితే అందుకు బాధ్యత ఉక్రెయిన్ పాలకులదేనని చెప్పారు. ఉక్రెయిన్ కు మద్దతుగా ఏ దేశం నిలిచినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు.

పుతిన్ ఆదేశాలతో

పుతిన్ ఆదేశాలతో రష్యా బలగాలు ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకునోపోయాయి. బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఉక్రెయిన్ మూడు వైపులా రష్యా బలగాలు మోహరించాయి. దాదాపు 1.50లక్షల రష్యా సైనికులు యుద్ధరంగంలో ఉన్నారు. ఉక్రెయిన్ ను పూర్తి స్థాయిలో ఆక్రమించుకోవడమే లక్ష్యంగా రష్యా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో భాగంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా బాంబాలు వర్షం కురిపించింది. కీవ్ ఎయిర్ పోర్టును రష్యా సైన్యం ఆక్రమించింది. ఉక్రెయిన్ లోని 11 నగరాలపై రష్యా దాడులు చేస్తోంది. ఖార్కివ్, ఒడిస్సా, మరియుపోల్ లో రష్యా క్షిపణుల దాడి జరుగుతోంది.

దేశాన్ని కాపాడుకుంటాం

మరో పక్క ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన ఉక్రెయిన్ ప్రభుత్వం..రష్యాకు ధీటుగా బలగాలను సిద్ధం చేసుకోంది. ఎయిర్ స్పేస్ ను మూసివేసింది. దేశాన్ని కాపాడుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. కాగా రష్యా – ఉక్రెయిన్ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి అత్యవసర భేటీ అయ్యింది. సమావేశానికి వివిధ దేశాల ప్రతినిధులు హాజరైయ్యారు. సైనిక చర్య నిలిపివేయాలని రష్యాను ఐక్యరాజ్యసమితి కోరింది.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju