Love: లవర్ కి తనపై ప్రేమ ఎంత ఉందో తెలుసుకోవడానికి వింత పరీక్ష పెట్టిన మాస్కో ప్రియుడు..!!

Share

Love: రష్యా దేశంలో మాస్కో ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తనపై తన ప్రియురాలికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి వింత పరీక్ష పెట్టాడు. ఆ యువకుడు చేసిన పనికి మాస్కో నగరం అంతా దద్దరిల్లిపోయింది. తనకు వచ్చిన ఆలోచన చూసి ఇ ఆ వింత పరీక్షకి మాస్కో నగరంలో రోడ్డుపై నడిచే వారు నోరెళ్ళ పడ్డాక మరికొంతమంది వెరైటీగా రియాక్ట్ అయ్యారు. మామూలుగా అయితే ప్రియుడు తనపై ప్రియురాలు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి.. వంట వండటమో… లేదా ఆమెని కొంత కాలం వెయిట్ చేయాలి అని కోరుటమో జరుగుతుంది.Russian 'influencer' drives with GF tied to car roof for 'trust test'

కానీ ఈ మాస్కో యువకుడు తన ప్రియురాలిని తన కారు పై కాళ్లు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి.. ప్రియురాలి చెయ్యి గట్టిగా పట్టుకుని ఆమెకు తనపై ఎంత నమ్మకం ఉందో తెలుసుకోవడానికి ఈ ఫీట్ చేయడం జరిగింది. ఈ వీడియోని సోషల్ మీడియాలో సదరు యువకుడు పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని చూసిన నెటిజన్లు తెగ షేర్ చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియో ఈ వింత పరీక్ష వైరల్ గా మారింది. దాదాపు 15 లక్షల మంది ఈ వీడియోని చూడటం జరిగింది. ఈ క్రమంలో కొంతమంది షేర్ చేసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా మరి కొంతమంది ఇది ఒక ప్రమాదకరమైన చర్యగా అభివర్ణించారు. ఏంటి ఈ పిచ్చి గణిత పరీక్ష..? ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటూ సదరు వీడియో పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.

 

ఇంటర్నెట్ లో భారీగా వైరల్ కావటంతో మాస్కో ప్రాంతానికి చెందిన పోలీసుల దృష్టికి వెళ్లడం జరిగింది. దీంతో వెంటనే పోలీసులు విచారణ చేపట్టి.. తన ప్రియురాల్ని కట్టేసిన ఆ లగ్జరీ కారు అబ్బాయిది కాదని.. అద్దెకు తీసుకున్నట్లు గుర్తించారు. అదే కారుపై దాదాపు 68 ట్రాఫిక్ కేసులు నమోదైనట్లు కూడా గుర్తించారు. ఇక ఇదే సమయంలో సదరు యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇటువంటి పిచ్చి పనులు రోడ్డుపై చేయకూడదని పోలీసులు గట్టిగా బుద్ధి చెప్పినట్లు సమాచారం. ఇంకా ఆ కారు పై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ వింత ప్రియుడు తన ప్రియురాలికి పెట్టిన పరీక్ష ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. నిజంగా అబ్బాయిలపై అమ్మాయికి ఉండే నమ్మకం.. ప్రేమ లోనే కాదు పెళ్లి జీవితంలో కూడా కీలకమని.. రిస్కు చేసే టైంలో అబ్బాయిల పై అమ్మాయిలకు నిజంగా నమ్మకం ఉండాలి అని అతడు చేసింది కరెక్ట్ అని అంటున్నారు. ఏది ఏమైనా తన పై తన ప్రియురాలికి ఎంత నమ్మకం ఉందో తెలుసుకోవడానికి.. ఈ మాస్కో ప్రాంతానికి చెందిన యువకుడు చేసింది అక్షరాల కరెక్ట్ అని చాలామంది నేటి తరం యువకులు సమర్ధిస్తున్నారు. ఆ అమ్మాయి కారు పై కూర్చున్న అంతసేపు డ్రైవింగ్ లో ఉన్న.. తన ప్రియుడు చేయని వదలకుండ కూర్చోవడం విశేషం. ఏది ఏమైనా జీవితం అనేది ఇక్కడ కారు గా చూస్తే పురుషుడు పై నమ్మకంతో స్త్రీ అనేది వాళ్ళిద్దరు చేతులు కలపడం లో.. అంతర్గత అర్థం దాగి ఉందని.. ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో చూసి చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 

 

 

View this post on Instagram

 

A post shared by Sergey Kosenko (@sergey_kosenko)


Share

Related posts

Modi : వాళ్ల ఓట్ల కోసం భ‌లే స్కెచ్చేసిన మోడీ

sridhar

Big Boss 5: బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ వీరే…? రానా హోస్ట్ గా వ్యవహరించేది వీళ్ళకే

arun kanna

Trivikram wife: త్రివిక్రమ్ వైఫ్ గురించి మీకు తెలియని విషయం !!

Naina