ట్రెండింగ్ న్యూస్

వావ్ షోలో స్టేజ్ మీదనే గెస్ట్ లపై అరిచేసిన సాయికుమార్?

saikumar serious on wow show
Share

వావ్.. అవును ఈ షో చూస్తే నిజంగానే వావ్ అంటారు ప్రేక్షకులు. బుల్లితెర మీదనే వావ్ అనేది డిఫరెంట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో సరదాతో పాటు కాస్త నాలెడ్జ్ కూడా వస్తుంది. ఈ షోకు వెళ్లే గెస్ట్ లకు కొన్ని ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పిన వాళ్లకు బహుమతులు ఇస్తారు. సినిమా రంగం మీద.. ఇతర రంగాల మీద ప్రశ్నలు ఉంటాయి. అయితే.. ఈ షోకు ప్లస్ పాయింట్ అంటే హోస్ట్ సాయికుమార్. సాయి కుమార్ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన వాయిస్ కు ఫిదా కాని వాళ్లు ఎవ్వరూ ఉండరు.

saikumar serious on wow show
saikumar serious on wow show

ఇప్పటి వరకు ఆయన ఏ బుల్లితెర మీద షో చేయనప్పటికీ.. మొదటిసారి ఈటీవీలో వావ్ షో చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సీజన్లను వావ్ షో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. మూడో సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

అయితే.. తాజాగా విడుదలైన లేటెస్ట్ ప్రోమోలో మొదటిసారి సాయికుమార్.. షోకు వచ్చిన గెస్ట్ లపై అరిచాడు. వాళ్లపై సీరియస్ అయ్యాడు. ఈ ఎపిసోడ్ లో జబర్దస్త్ కు కంటెస్టెంట్లు బుల్లెట్ భాస్కర్, రాజమౌళి, గాలిపటాల సుధాకర్, నటి ఫ్రూటీ అలియాస్ గీతాంజలి గెస్ట్ లుగా వచ్చారు.

అయితే.. షో మధ్యలోనే షూటింగ్ జరుగుతుండగా… జబర్దస్త్ రాజమౌళి షో నుంచి బయటికి వెళ్లిపోవడంతో సాయికుమార్.. బుల్లెట్ భాస్కర్, గాలిపటాల సుధాకర్ పై సీరియస్ అయ్యాడు. మీరే రాజమౌళికి బాగా చనువు ఇచ్చారంటూ సీరియస్ అయ్యాడు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

నిజంగా అసలు షోలో ఏమైంది అనే విషయం తెలియాలంటే మాత్రం ఎపిసోడ్ ప్రసారం అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికైతే ఈ ప్రోమో చూసేయండి.


Share

Related posts

Donald Trump: ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై డోనాల్డ్ ట్రంప్ వైరల్ కామెంట్స్..!!

sekhar

ఆర్ఆర్ఆర్ రిలీజ్ లెట్ అయ్యేలా చేస్తున్న ఆ నటి!

Teja

Microwave oven: మైక్రోవేవ్ ఓవెన్ వాడడం మంచిదా? కాదా?

Kumar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar