Featured జాతీయం బిగ్ స్టోరీ

జగన్ – అమిత్ షా కలయిక..! “ష్” అవి ఢిల్లీ సీక్రెట్లు..! సీక్రెట్ బ్లాస్టింగులు..!?

secret agenda between amith shah and jagan meet
Share

ఏపీ సీఎం జగన్ ఈ మధ్య ఎక్కువగా ఢిల్లీ వెళ్తున్నారు. అక్టోబర్ లో వెళ్లారు. నవంబర్ లో వెళ్లారు. డిసెంబర్ లో వెళ్లారు. ఇదిగో నిన్న కూడా వెళ్లారు. వెళ్లిన విషయం తెలుసు కాబట్టి.. అమిత్ షాని జగన్ కలిసిన విషయం తెలుసు కాబట్టి.. సీఎం ఆఫీస్ నుండి ఒక అధికారిక ప్రెస్ నోట్ వస్తుంది. ప్రత్యేక హోదా అని, రెవెన్యూ లోటు అని, పోలవరం నిధులు అనీ, మూడు రాజధానులకు సహకారం అనీ ఇలా రకరకాల అంశాలు మాట్లాడారు అంటూ ప్రెస్ నోట్లు వస్తుంటాయి. రాసుకున్నోళ్లకు రాసుకున్నంత..! కానీ కొన్ని పాయింట్లు మిస్ కాకూడదు..!!

* ఈ పోలవరం, మూడు రాజధానులు, ప్రత్యేక హొదా, రెవెన్యూ లోటు అనేవి జనవరి 19 వ తేదీనో.., గత డిసెంబర్, నవంబర్ నెలల్లోనే మాట్లాడాల్సిన అంశాలు కానే కాదు. అన్నీ పాత అంశాలే. పాత అంశాలు పట్టుకుని అమిత్ షాని కలిసి వినతి పత్రాలు ఇచ్చే తీరిక జగన్ కి లేదు.., అవే అంశాల కోసం జగన్ కి అపాయింట్మెంట్ ఇచ్చే తీరిక అమిత్ షాకి కూడా లేదు. ఎన్నటికీ నెరవేరని ప్రత్యేక హోదా లాంటి అంశాల కోసం మాట్లాడుకునే టైం పాస్ వ్యవహారాల్లో అమిత్ షా, జగన్ ఇద్దరూ లేరు..!!

ap cm ys jagan meets amit shah

* పోలవరానికి నిధులు ఇవ్వాల్సింది జలవనరుల శాఖ మంత్రి లేదా.., కేంద్ర ఆర్ధిక మంత్రి.., లేదా ప్రధాన మంత్రి..! ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఆర్ధిక మంత్రి లేదా ప్రధాన మంత్రి.. రెవెన్యూ లోటు తీర్చాల్సింది కూడా ఈ ఇద్దరే. ఆ మూడు అంశాల కోసం కేంద్ర హోమ్ మంత్రిని కలవాల్సిన అవసరం లేదు. అందుకే సీక్రెట్లు ఉంటాయి. ఈ కలయిక మాత్రం కొన్ని రహస్య అజెండా ప్రకారమే అనేది స్పష్టం..! అక్కడ సీక్రెట్లు ఉన్నాయి. కచ్చితంగా బయటకు చెప్పలేని కొన్ని సీక్రెట్లు ఉన్నాయి.

ఏమో ఏమైనా బాంబులు బ్లాస్ట్ కావచ్చు..!?

గత అక్టోబర్ నెలలో ఆరో తేదీన సీఎం జగన్ అమిత్ షాని కలిసిన తర్వాత రెండు రోజుల్లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణపై అనేక ఆరోపణలతో సీఎం జగన్ పిర్యాదు చేసారు. ఆ కలయికకు, ఈ ఫిర్యాదుకు ఉన్న సంబంధాన్ని కొట్టి పారేయలేం.
* ఆ తర్వాత అమిత్ షా ని కలిసిన మూడు రోజుల్లో ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు జరిగాయి. ఏపీ చీఫ్ జస్టిస్ కూడా బదిలీ అయ్యారు. ఆయనకు చిన్న రాష్ట్రం అయినా సిక్కిం వేశారు. అక్కడి సీజేకి ఏపీలో పోస్టింగ్ ఇచ్చారు. ఇక్కడ కూడా జగన్ – అమిత్ షా కలయికకు.. ఈ బదిలీలకు ఉన్న బంధాన్ని కొట్టిపారేయలేం..!

secret agenda between amith shah and jagan meet
secret agenda between amith shah and jagan meet

విగ్రహాల ధ్వంసం..! బీజేపీ పాత్ర..!?

ప్రస్తుతం ఏపీలో విగ్రహాల రాజకీయ గందరగోళం జరుగుతుంది. అనేక ఆలయాల్లో హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. వీటిపై స్పందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ విగ్రహాల ధ్వంసం ఘటనల్లో టీడీపీ, బీజేపీ పాత్ర ఉంది అంటూ చెప్పారు. మొత్తం కేసుల్లో 80 శాతం టీడీపీ పని, 20 శాతం బీజేపీ పని అంటూ బహిరంగంగా వెల్లడించడంతో బీజేపీ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏకంగా డిజిపికి లీగల్ నోటీసు కూడా పంపించారు. ఇక్కడ అగ్గి రాజుకుంది. హిందూ రాజకీయం.. దేవతల విగ్రహాల దాడితో రాజకీయంగా యాక్టీవ్ అవుతున్న బీజేపీకి డీజీపీ చేసిన కామెంట్లు చిరాకు పుట్టించాయి. అందుకే ఈ అంశంపై బీజేపీ పెద్దల సూచనల మేరకు నడుచుకోవాలని డిసైడ్ అయింది. సరిగా ఇదే సమయంలో జగన్ వెళ్లి ఢిల్లీ పెద్దలను కలవడం..? వెనుక సీక్రెట్లు “పోలవరం నిధుల్లో.., రెవెన్యూ లోటులో .., రాజధాని వికేంద్రీకరణలో.., కాదు. అక్కడి సీక్రెట్లు, వాస్తవాలు వేరు. కాస్త జాగ్రత్తగా కీలక పాయింట్లు.., టూర్ కి మూడు రోజుల ముందు రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకుంటే టూర్ వెనుక కారణాలు తెలుసుకోవచ్చు..!!

 

 

 

 

 

 


Share

Related posts

Metro Sridharan : మెట్రో శ్రీధరన్ కేరళలో కమలానికి పవర్ తెచ్చిపెట్టేనా?బిజెపి మెగా ప్రయోగం ఫలించేనా?

Yandamuri

Corona: మళ్లీ క‌రోనా డేంజ‌ర్ జోన్లోకి మ‌హారాష్ట్ర… అస‌లేం జ‌రుగుతోంది?

sridhar

లవ్ సక్సెస్ చేసుకున్న ఆ నూతన వధువు

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar