Salman: అత్రాంగి రే (Atrangi Re) హీరోయిన్ సారా అలీ ఖాన్ (Sara Ali Khan) ఎప్పుడూ కూడా జోకులు పేలుస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది. ఆమె సెన్సాఫ్ హ్యూమర్‌కి బాలీవుడ్‌లో ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan)పై జోక్స్ పేల్చింది. దాంతో అవాక్కవడం సల్లూభాయ్ వంతయింది. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్‌గా మారాయి.
రీసెంట్‌గా దుబాయ్‌లో ఐఫా 2022 అవార్స్ ఈవెంట్ జరిగింది. ఇందులో ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలందరూ పాల్గొన్నారు. వారిని నవ్వించేందుకు ఈ కార్యక్రమంలో చాలా ఫన్నీ సంభాషణలు జరిగాయి. అయితే వాటన్నిటిలోకెల్లా సల్మాన్ ఖాన్, సారా అలీ ఖాన్ మధ్య జరిగిన సంభాషణ అందర్నీ ఆకట్టుకుంది. ఈ సంభాషణలో స్టేజ్‌పైకి వచ్చిన సల్మాన్‌ని అంకుల్ అంటూ సారా అలీ ఖాన్ అందరి ముందే పిలిచింది. దీంతో అతని ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి.
అంకుల్ అని పిలవగానే అక్కడికి విచ్చేసిన అతిథులందరూ పకపకా నవ్వేశారు. ఆ తర్వాత సల్మాన్ మాట్లాడుతూ.. “నాతో చేసే ఒక సినిమా నువ్వు కోల్పోయావ్” అని కాస్త కోపంగా అనేశాడు. దాంతో చాలా అమాయకంగా ఎందుకని సారా ప్రశ్నించింది. “ఎందుకంటే నువ్వు నన్ను అందరిముందే అంకుల్ అని పిలిచావ్” అని దబాంగ్ హీరో బుంగమూతి పెడుతూ అన్నాడు. “మీరే కదా అంకుల్ అని పిలవమన్నది” అని తనదేం తప్పు లేదన్నట్టుగా సారా ముద్దుముద్దుగా మాటలు పలికింది. ఆ తర్వాత సల్లూభాయ్ కూల్ కావడంతో మళ్లీ సరదాగా అతడితో మాట్లాడింది. అనంతరం ఒక బాలీవుడ్ పాటకు వీరిద్దరూ డాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోని కలర్స్‌టీవీ (colorstv) ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది. సారా అలీ ఖాన్ వయస్సు ఇప్పుడు కేవలం 26 ఏళ్లే! సల్మాన్ వయసు 56 ఏళ్లు. దాంతో అతడు ఆమెను తన ని అంకల్ అనే పిలవమన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎంత చిన్న హీరోయిన్ అయినా సీనియర్ హీరోని సార్ అని పిలుస్తుంది కానీ ఇక్కడ వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది కాబట్టి సారా అంకుల్ అని నిర్భయంగా పిలిచింది.
ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…