Samantha : చైతన్యతో విడిపోయిన తరువాత సామ్ మంచి జోష్ లో ఉందనే చెప్పుకోవాలి. మొదట ఒకింత డిప్రెషన్ మెంటైన్ చేసినా, తరువాత కోలుకొని వరుస సినిమాలను లైన్ లో పెట్టేసింది. గత ఏడాది ఆమెకు మంచి విజయాలే పలకరించాయి. వాటిలో ముందు వరుసలో వున్నది మాత్రం ‘ది ఫామిలీ మ్యాన్ 2’. ఇందులో సామ్ చేసిన రాజీ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఫస్ట్ టైం సామ్ కు నటనకు ప్రాధాన్యత వున్న పాత్ర దక్కిందని చెప్పుకోవాలి. అలాగే ఈ ఏడాది కూడా సామ్ హవా కొనసాగనుంది.
Samantha : సమంత వదులుకున్న సినిమా ఇదే..
ఇకపోతే సామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూ వేదికగా ఇలా స్పందించింది. ఇటీవల నాని మరియు సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగ రాయ్ విడుదలై థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసినదే. ఇకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ దాదాపు 50 కోట్లకు చేరువలో ఉంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధించింది. ఈ సినిమా గురించి సామ్ స్పందించింది. ఇందులో టైటిల్ రోల్ కి సామ్ ని అడిగారట. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో వద్దనుకుందట.
శ్యామ్ సింగ రాయ్ కలెక్షన్లు ఇవే..
మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్ల వసూళ్లను కొల్లగొట్టనుంది. ఇదే జరిగితే బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు రాబట్టిన నాని తొలి సినిమా ఇదే అవుతుంది. ఇక ఈ చిత్రంలో నాని, సాయి పల్లవి, కృతి శెట్టితో పాటు మడోన్నా సెబాస్టియన్, జిషు సేన్‌గుప్తా, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, అభినవ్ గోమతం, మనీష్ వాధ్వా, లీలా శాంసన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కథను జంగా సత్యదేవ్ అందించగా, ఈ చిత్రానికి సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ అందించారు.