NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YSRCP: సీఎం జగన్ ను ఆ మాజీ ఎంపీ కలిసింది అందుకేనా…? విజయసాయికి రెన్యువల్ ఉన్నట్లా..? లేనట్లా…?

YSRCP: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రీసెంట్ గా ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో భేటీ అయ్యారు. రెండు రోజుల క్రితం తాడేపల్లికి వచ్చిన పొంగులేటి.. సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో పొంగులేటి ఉన్నప్పటికీ అంత యాక్టివ్ గా లేరు. ఇంతకు ముందు వైఎస్ఆర్ సీపీ ఖమ్మం ఎంపీగా పొంగులేటి గెలిచారు. 2014 ఎన్నికల్లోనూ, వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర సమయంలోనూ పొంగులేటి క్రియాశీలకంగా పని చేశారు. త్వరలో ఏపిలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అవ్వనుంది. ఈ తరుణంలో సీఎం వైఎస్ జగన్ తో పొంగులేటి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

YSRCP rajya sabha seats
YSRCP rajya sabha seats

YSRCP: జూన్ లో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలు

ఈ ఏడాది జూన్ మాసంలో ఏపి నుండి ఎన్నికైన నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తో పాటు బీజేపీ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభుల పదవీ కాలం ముగియనుంది. సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ లు టీడీపీ నుండి రాజ్యసభకు ఎన్నికైనా ఆ తరువాత బీజేపీలో విలీనం కావడంతో బీజేపీ సభ్యులుగానే పదవీ విరమణ చేస్తున్నారు. నాడు ఎన్డీఏ మిత్ర పక్షంగా ఉన్న కారణంగా బీజేపీ పెద్దల విజ్ఞప్తి మేరకు సురేష్ ప్రభును టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడుగా ఎంపిక చేశారు. సురేష్ ప్రభును రెన్యువల్ చేయాలని కేంద్రంలోని బీజేపీ పెద్దలు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ను కోరతారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.

YSRCP: విజయసాయి రాజ్యసభ సభ్యత్వాన్ని కొనసాగిస్తారా..?

పలువురు నేతలకు గతంలో సీఎం వైఎస్ జగన్ రాజ్యసభ సీటు హామీ ఇచ్చి ఉన్నారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో జగన్ ఎవరెవరికి అవకాశం ఇస్తారు..? అనేది వైసీపీలోనే పెద్ద చర్చ జరుగుతోంది. వైసీపీ సీనియర్ నేత విజయసాయి రాజ్యసభ సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నప్పటికీ ప్రస్తుతం ఆయనకు ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ చార్జితో పాటు కేంద్రంలో ఏపి వ్యవహారాలు చూసే ప్రతినిధిగానూ వ్యవహరిస్తున్నారు. గత కొంత కాలంగా విజయసాయి రాజ్యసభ సభ్యత్వాన్ని కొనసాగిస్తారా..? లేదా అనే విషయంపై చర్చ జరుగుతోంది. ఈ తరుణంలోనే తను రాజ్యసభకు మరో సారి వెళ్లనని విజయసాయిరెడ్డే కొందరు పార్టీ నేతల వద్ద చెప్పినట్లు వార్తలు వినబడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ నుండి విజయసాయి పోటీ చేయాలని భావిస్తున్నారనీ, అందుకే రెన్యువల్ గురించి అడగడం లేదని అంటున్నారు.

YSRCP: పొంగులేటి జగన్ ను కలిసింది రాజ్యసభ కోసమేనా..?

ఈ క్రమంలో విజయసాయి రెడ్డిని మరో సారి నామినేట్ చేయకపోతే ఆ అవకాశాన్ని తనకు కల్పించాలని పొంగులేటి జగన్ ను కోరినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. సీఎం జగన్ ఊ కొడితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తారని అంటున్నారు. 2014లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి వైసీపీ ఎంపిగా గెలిచిన పొంగులేటి అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ లో చేరారు. అయితే కేసిఆర్ 2019 లో పొంగులేటిని కాదని టీడీపీ నుండి టీఆర్ఎస్ లో నామా నాగేశ్వరరావుకు ఇచ్చారు. దీంతో మనస్థాపానికి గురైన పొంగులేటి పార్టీ పై అసంతృప్తి, అసమ్మతిగా ఉంటున్నారని అంటున్నారు. ఈ తరుణంలో పొంగులేటి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం జగన్ ను కలిసి వెల్లడంతో ఆయన రాజ్యసభ సీటు కోసమే వచ్చారని ప్రచారం జరుగుతోంది. రెడ్డి కోటాలో విజయసాయిరెడ్డికే రెన్యువల్ చేస్తారా..? లేక పొంగులేటికి జగన్ అవకాశం కల్పిస్తారా..? అనేది తెలియాలంటే కొద్ది నెలలు ఆగాల్సిందే.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju