నాలుగో సీజన్ బిగ్ బాస్ కి రంగం సిద్ధమైపోయింది. మరో నాలుగు రోజుల్లో బుల్లితెర ప్రేక్షకులను టీవీలకు కట్టుపడేయనున్న ఈ రియాల్టీ షో కి ‘కింగ్’ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షో లో పాల్గొనబోయే 16 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ అయిపోయింది.
ఈ క్రమంలో నిర్వాహకులు కోవిడ్ నేపథ్యంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు దాదాపు రెండు వారాల పాటు కంటెస్టెంట్స్ అందరినీ క్వారంటైన్ లో ఉంచారు. అలాగే చివరి నిమిషంలో కంటెస్టెంట్స్ లిస్టు లో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు కూడా తెలుస్తోంది. ప్రముఖ సింగర్ యాక్టర్ నోయల్ కరోనా బారిన పడడంతో అతని స్థానంలో వేరొకరిని…. ఇక సుడిగాడు హీరోయిన్ ‘మోనాల్ గజ్జర్’ ని కూడా చివరి నిమిషంలో కన్ఫర్మ్ చేసినట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా మొదటి వారమే భారీ టీఆర్పీ రేటింగ్స్ బిగ్ బాస్ సొంతమని నివేదికలు వచ్చేశాయి. ట్విట్టర్ ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా బిగ్ బాస్ మోత మోగిపోతోంది. బిగ్ బాస్ హ్యాష్ ట్యాగ్ తో ప్రచారం అవుతున్న వార్తలు ప్రజల్లో ఉత్తేజాన్ని నింపుతున్నాయి. ఇక ఆ సోషల్ మీడియా పోస్టులకు రీచ్ కూడా భారీగా ఉంటోంది.
ఇటువంటి రియాలిటీ షోల పై సాధారణంగా యువత ప్రత్యేక ఆసక్తి చూపించడం చాలా అరుదు. మామూలుగా ఫ్యామిలీస్ బిగ్ బాస్ షో కి ఫాన్స్ అవుతాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న ఊపు చూస్తుంటే ఈ షో ‘స్టార్ మా’ కి ఆల్ టైం రికార్డు టీఆర్పి ని అందజేస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. అంతేకాకుండా టిమ్ టాక్ స్టార్స్, యూట్యూబ్ సెలెబ్రెటీస్, సినీ హీరోయిన్ ల తో పూర్తిగా షో ని గ్లామర్ తో నింపేశారు నిర్వాహకులు. ఇక టిఆర్పీ రాక చస్తుందా..?
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!