ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు మంచి పాజిటీవ్ మూడ్లో ఉంటారు. మనసారా నన్వితే గుండెనొప్పితో సహా కొన్ని వ్యాధులను సమర్ధవంతంగా నిరోధించవచ్చు అని ఆరోగ్య నిపుణుల మాట.
ఒత్తిడుల మూలంగా తలెత్తుతున్నా జబ్బులన్నింటికీ నవ్వే పరమ ఔషధమంటున్నారు. మనం గట్టిగా నవ్వితే ఊపిరితిత్తులు తెరుచుకుని స్వచ్ఛమైన గాలిని గ్రహిస్తాయి. నవ్వు శక్తి తో పాటుగా ప్రశాంతతను ఇస్తుంది. మితిమీరిన ఒత్తిడి, పోటీతత్వం తదితర సమస్యలు మనల్ని నవ్వు నుంచి దూరం చేయడమే కాదు నవ్వునే మరిచి పోయేలా చేస్తున్నాయి. నలుగురితో కబుర్లు చెబుతూ కాసేపు నవ్వుకోవాలన్నా, పని ఒత్తిడి సాధ్యం కావడం లేదు.
అయితే, నవ్వకపోవడం వల్ల ఏం కోల్పోతున్నామో కచ్చితం గా తెలియవలిసిందే .మనకు వచ్చే రోగాల్లో 70 శాతం ఒత్తిడి వల్ల వచ్చేవే . గుండె జబ్బులు, డయబెటీస్, రక్తపోటు, డిప్రెషన్, ఇన్సోమియా, మైగ్రేన్, ఆతృత, అలర్జీ, అల్సర్ తదితరాలన్నీ ఒత్తిడితోవలన వచ్చేవే. వీటిని పోగొట్టుకోవాలంటే నవ్వు ఒక్కటే ఏకైక మార్గం .
నలుగురితో కలిసి సరదాగా నవ్వేవారికి, ఒంటరిగా ఉండే వ్యక్తులకు మధ్య చాలా తేడాలు ఉంటాయి అని ఓ సర్వేలో తేలింది. తరచూ నవ్వేవారికి గుండెజబ్బు వచ్చే ప్రమాదం తక్కువ అని ఆ సర్వేలో నిరూపించ బడింది .
నవ్వడం వల్ల ఆందోళన దూరమై.. ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ల శ్రావకాలుతగ్గుతాయి . పది నిమిషాలు నవ్వడం వల్ల 10-20 మి.మీల రక్తపోటు తగ్గుతుంది . నవ్వు వల్ల రోగనిరోధక వ్యవస్థకు అవసరమైన లింపాజైట్స్ ఉత్పత్తి పెరుగుతుంది.
నవ్వడం వల్ల ముక్కుతో పాటు శ్వాసకోశాల్లోని పొరలు ఆరోగ్యంగా ఉంటాయి.
నవ్వు శరీరంలో సహజ రోగ నిరోధక హార్మోన్ల ఉత్పత్తి పెంచుతాయి. ఫలితంగా ఆర్థరైటిస్, స్పాండలైటిస్, మైగ్రేన్ లాంటి వ్యాధులు దూరమవుతాయి .
నవ్వు వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్ పరిమాణం పెరుగుతుంది .
ఆస్తమా రోగులకూ సైతం నవ్వు చాలా మంచిది .
తెలిసిందిగా నవ్వడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. ఇప్పటికైనా సీరియస్
ముఖాన్ని చిరునవ్వులు పూయించే కొలనుగా మార్చేసుకోండి. బాగా నవ్వండి.. నవ్వించండి … హాయిగా,ఆరోగ్యం గా జీవించండి.