NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ష‌ర్మిల అతి, ఓవ‌ర్ యాక్ష‌న్ చూశారా… !

ఏపీ కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్టిన ష‌ర్మిల‌.. అస‌లు వ్యూహాన్ని వ‌దిలేసి.. అతి చేస్తున్నార‌నే టాక్ సొంత పార్టీలోనే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ర విభ‌జ‌న‌తో పార్టీ ఏపీలో తుడిచి పెట్టుకుపోయింది. దీంతో గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ (2014, 2019) కాంగ్రెస్ పార్టీకి త‌ర‌ఫున ఒక్క‌రు కూడా విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు. పైగా ఓటు బ్యాంకు 0.8 శాతానికి ప‌డిపోయింది. ఈ నేప‌థ్యంలో పార్టీని పున‌రుజ్జీవింప చేయాల‌ని కాంగ్రెస్ ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఈ నేప‌థ్యంలోనే వైఎస్ త‌న‌యగా ష‌ర్మిల‌కు ఏపీ పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

అంటే.. ష‌ర్మిల ప్రాధాన్యం తొలుత పార్టీపై ఉండాలి. పార్టీలోకి నేత‌ల‌ను ఆహ్వానించ‌డం, స‌భ్య‌త్వం పెంచ డం వంటివాటిపై ఆమె దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అదేస‌మ‌యంలో పార్టీ నుంచి దూర‌మైన నాయ‌కుల‌తో చ‌ర్చించి.. వారిని త‌నవైపు తెచ్చుకుని.. పార్టీని ముందుకు న‌డిపించే వ్యూహాల‌కు ప‌దును పెట్టాల్సి ఉంది. అయితే.. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టిన ష‌ర్మిల‌.. అత్యంత అప్రాధాన్య‌మైన ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసుకునే ల‌క్ష్యాన్ని.. త‌న సొంత అజెండాను అమ‌లు చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

నిజానికి ష‌ర్మిల వ‌చ్చిన త‌ర్వాత‌.. (ఇప్ప‌టికి 2 నెల‌లు అయింది) ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా కీల‌క నాయ‌కుడు ఆమె ప‌క్షాన పార్టీలో చేరింది లేదు. అంతేకాదు.. వైసీపీ నుంచి వ‌చ్చిన ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి వంటివారిని కూడా నిల‌బెట్టుకోలేక పోయారు. ఇది భారీ అప‌శృతి. దీనిని స‌రిదిద్దుకుని.. త‌న లోపాల‌ను స‌రిచేసుకోవాల్సిన ష‌ర్మిల.. కేవలం ప్ర‌భుత్వంపై పోరాటానికే ప్రాధాన్యం ఇస్తున్నార‌నేది పార్టీలోనే జ‌రుగుతున్న అంత‌ర్గ‌త చ‌ర్చ‌. కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు కొత్త‌కాదు.

పైగా ప్ర‌భుత్వంపై పోరాటాలు చేస్తే.. ప్ర‌జ‌ల్లో సానుభూతి వ‌స్తుంద‌న్న ఆశ‌లు కూడా ఆ పార్టీకి లేవు. ప్ర‌జ‌ల ప‌క్షాన క‌మ్యూనిస్టులు అనేక పోరాటాలు చేసినా.. వారి ఓటు బ్యాంకును ఎక్క‌డా పెంచుకోలేక పోయారు. ముందు పార్టీ నాయ‌క‌త్వాన్ని పెంచుకుంటే.. ఆటోమేటిక్‌గా పార్టీ బ‌ల‌ప‌డుతుంది. త‌ద్వారా.. ప్ర‌జా పోరాటాలుచేసుకుని ప్ర‌జ‌ల్లో విశ్వ‌స‌నీయ‌త‌ను పెంచుకునే అవ‌కాశం ఉంటుంది.

ఇది వ‌దిలేసిన ష‌ర్మిల‌.. ఏదో ఒక కార‌ణాన్ని, నిర్ణ‌యాన్ని చూపించి.. త‌న సొంత అజెండా అమ‌లు చేస్తున్నార‌ని.. పార్టీ వ‌ర్గాలు కినుక వ‌హిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే సీనియ‌ర్లు సాకే శైల‌జానాథ్ వంటి వారు కూడా.. పార్టీకి దూరంగా ఉంటున్నార‌ని అంటున్నారు. ష‌ర్మిల రాక‌తో.. ఇపప్ప‌టి వ‌రకు ఒన‌గూరిన ల‌బ్ధి ఏమీ లేద‌ని కూడా చెబుతున్నారు.

Related posts

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?