NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీకి ట‌చ్‌లోకి కీల‌క నేత‌.. బెజ‌వాడ‌లో అర్థ‌రాత్రి హైడ్రామా…!

వైసీపీ నుంచివ‌చ్చి.. తిరిగి వైసీపీలోకి వెళ్లిపోయేందుకు ప్ర‌య‌త్నించిన కీల‌క నేత విష‌యంలో టీడీపీ హు టాహుటిన స్పందించింది. స‌త్వ‌ర చర్య‌లు చేప‌ట్టింది. దీంతో స‌ద‌రు నాయ‌కుడు వెన‌క్కి త‌గ్గారు. విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్‌.. వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున ఆయ‌న కుమార్తెకు టికెట్ ఇప్పించుకున్నారు. అయితే, ఆమె ఓడిపోయారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని ఆయ‌న కోరుతున్నారు.

అయితే.. ప‌శ్చిమ టికెట్‌ను జ‌న‌సేన‌కు కేటాయించే విష‌యంపై టీడీపీలో అంత‌ర్మ‌థ‌నం సాగుతోంది. ఈ టికెట్ కోసం.. పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఉత్త‌రాంధ్ర జిల్లాల ఇంచార్జ్ బుద్ధా వెంక‌న్న కూడా ప‌ట్టుబ‌డు తున్న విష‌యం తెలిసిందే. ఈయ‌న ఏకంగా చంద్ర‌బాబు పాదాల‌ను(ఫ్లెక్సీ) ర‌క్తం క‌డిగి సంచ‌ల‌నం సృష్టించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌నే పోటీ చేస్తాన‌ని కూడా చెప్పారు. మ‌రోవైపు.. త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే.. ముస్లింలు ఉరేసుకుంటార‌ని జ‌లీల్ ఖాన్ సెగ పెంచారు.

అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ విష‌యాన్ని లైట్ తీసుకున్నారు. దీంతో బుధ‌వారం రాత్రి నుంచి ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిణామాలు ఆస‌క్తిక‌ర మ‌లుపు తిరిగేలా మారాయి. వైసీపీ కీల‌క నేత సాయిరెడ్డి ట‌చ్‌లోకి జ‌లీల్‌ఖాన్ వెళ్లిపోయారు. అయితే.. ఈ స‌మాచారం లీకై… టీడీపీ అధినేత చంద్ర‌బాబు చెవిలో ప‌డింది. ఆ వెంట‌నే అలెర్ట్ అయిన‌.. బాబు వెంట‌నే విజ‌య‌వాడ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌.. కేశినేని చిన్నిని రంగంలోకి దింపారు. ఆయ‌న నేరుగా జలీల్‌ఖాన్‌తో అప్ప‌టిక‌ప్పుడు భేటీ అయ్యారు.

అర్ధ‌రాత్రి 2 గంట‌ల వ‌ర‌కు ఇరువురి మ‌ధ్య చ‌ర్య‌లు జ‌రిగాయి. టికెట్ స‌హా.. ప‌లు అంశాల‌పై చ‌ర్చించిన ట్టు తెలిసింది. అయితే.. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు దృష్టికి తీసుకువెళ్తాన‌ని చిన్ని హామీ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు కూడా జ‌లీల్‌ఖాన్‌కు ఫోన్ చేసి.. ఉండ‌వ‌ల్లికి రావాల‌ని.. అన్ని విష‌యాలూ చ‌ర్చించుకుందామ‌ని ఆహ్వానించారు. దీంతో శాంతించిన జ‌లీల్‌ఖాన్‌.. ఉండ‌వ‌ల్లికి వెళ్లేందుకు అంగీక‌రించారు. దీంతో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రుగుతుందోన‌న్న ఆస‌క్తి మ‌రింత పెరిగింది.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయోచ్ .. పార్వతీపురం మన్యం ఫస్ట్ .. కర్నూల్ లాస్ట్.. రిజల్ట్స్ ఇలా తెలుసుకోండి

sharma somaraju

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Maldives Parliamentary Elections: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా

sharma somaraju

Lok Sabha Elections 2024: భారీ భద్రత నడుమ మణిపూర్ లో కొనసాగుతున్న రీపోలింగ్

sharma somaraju

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

Congress: ఏపీలో మరో 9మందితో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన

sharma somaraju

AP Elections 2024: అనపర్తి నుండి పోటీ చేసేది బీజేపీ అభ్యర్ధే .. కానీ ..సమస్య పరిష్కారం అయ్యింది ఇలా..!

sharma somaraju