Siva nirvana: హ్యాట్రిక్ కొట్టాలనుకున్న శివ నిర్వాణ..ఆ పొరపాటే ఫ్లాప్ ఇచ్చిందా..?

Share

Siva nirvana: టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా మిగతా సౌత్ భాషలతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ కొందరు దర్శకులు వరుసగా హిట్స్ అందుకుంటున్నవారున్నారు. అయితే అలా వరుస హిట్స్ అందుకునే వారు చాలా తక్కువమందే ఉన్నారు. టాలీవుడ్ విషయానికొస్తే ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ అంటు ఎరగని దర్శకులు ముగ్గురున్నారు. వారే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్ కొరటాల శివ, అనిల్ రావిపూడి. ఈ ముగ్గురు ఇప్పటివరకు వరుస హిట్స్‌తో అంతకంతా తమ స్టార్ ఇమేజ్‌ను అమాంతం పెంచుకుంటున్నారు.

siva-nirvana expected hatric but missed
siva-nirvana expected hatric but missed

కోలీవుడ్‌లో శివ, హెచ్.వినోద్, లోకేశ్ కనగరాజ్, అట్లీ, లేడీ స్టార్ డైరెక్టర్ సుధ కొంగర లాంటి వారున్నారు. ఇలా వరుస సక్సెస్‌లు అందుకుంటున్నవారు మిగతా భాషలలో కూడా ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం హ్యాట్రిక్ హిట్ కొట్టేలోపే ఫ్లాప్ నెత్తిమీద పడుతుంది. అలాంటి దర్శకులలో శివ నిర్వాణ కూడా చేరారు. నేచురల్ స్టార్ నాని – నివేతా థామస్ – ఆది పినిశెట్టి నటించిన సినిమా నిన్నుకోరి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దర్శకుడిగా శివ నిర్వాణ మేకింగ్ చాలా బావుందని ఇండస్ట్రీ ప్రముఖులు మెచ్చుకున్నారు.

Siva nirvana: నిన్నుకోరి సినిమాతో శివ నిర్వాణ మంచి హిట్ ఇచ్చాడు.

నానికి అంతకముందు మంచి హిట్ లేదు. నిన్నుకోరి సినిమాతో శివ నిర్వాణ మంచి హిట్ ఇచ్చాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే డిఫ్రెంట్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫ్రెష్ ఫీల్ ఉండటంతో ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, సెంటిమెంట్ లాంటి అంశాలతో తెరకెక్కించిన నిన్నుకోరి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చెప్పాలంటే ఈ సినిమా తర్వాత మళ్ళీ నానీకి మంచి హిట్ కూడా దక్కలేదు. ఇక శివ నిర్వాణ రెండవ సినిమాగా అక్కినేని నాగ చైతన్య – సమంతలతో మజిలీ సినిమాను రూపొందించాడు.

పెళ్ళి తర్వాత నాగ చైతన్య – సమంత కలిసి నటించిన సినిమా కావడంతో షూటింగ్ స్టేజ్ నుంచే మజిలి సినిమా మీద మంచి అంచనాలు పెరుగుతూ వచ్చాయి. నిజ జీవితంలో భార్య భర్తలైన సమంత – చైతూ ఈ సినిమాలో కూడా భార్య భర్తలుగా నటించడం విశేషం. కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందిన మజిలీ సినిమా భారీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. సమంత – చైతూల కెరీర్‌లో ఈ సినిమా మైల్ స్టోన్‌లా నిలిచేదిగా మిగిలింది. ఈ సినిమా తర్వాత దర్శకుడిగా శివ నిర్వాణ క్రేజ్ మరింతగా పెరిగింది. అందుకే విజయ్ దేవరకొండ లాంటి మాస్ హీరో కూడా శివ నిర్వాణతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Siva nirvana: ఆ సినిమా ఉంటుందా లేదా అనేది సస్పెన్స్ నెలకొంది.

అయితే ఇప్పుడు ఆ సినిమా ఉంటుందా లేదా అనేది సస్పెన్స్ నెలకొంది. తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమా వచ్చింది. నానితో ఇది రెండవ సినిమా. చాలా కాలం తర్వాత నానిని మాస్ హీరోగా చూపించాడు శివ నిర్వాణ. సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కథలో ఏమాత్రం కొత్తదనం లేక సినిమా ఫ్లాప్ అనే టాక్ తెచ్చుకుంది. హ్యాట్రిక్ కొట్టాలనుకున్న శివ నిర్వాణకి గట్టి షాక్ తగిలింది. అంతేకాదు నాని సహా ఈ సినిమా మీద హీరోయిన్స్ రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్ కూడా చాలా నమ్మకాలు పెట్టుకున్నారు.

కానీ అందరి ఆశల మీద టక్ జగదీశ్ నీళ్ళు చల్లాడు. ఇందుకు కారణం శివ నిర్వాణ ఎంచుకున్న జోనర్ కథే అని చెప్పుకుంటున్నారు. నిన్నుకోరి, మజిలీ లాంటి విభిన్నమైన సినిమాలను తీసి హిట్ ఇవ్వడంతో టక్ జగదీష్ మీద అంచనాలు పెరిగితే ఆ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. పొరపాటున శివ నిర్వాణ తన రూట్ మార్చడం వల్లే ఫ్లాప్ పడి హ్యాట్రిక్ హిట్ మిస్ అయిందని చెప్పుకుంటున్నారు. మరి నెక్స్ట్ మూవీకి ఎలాంటి కథ ఎంచుకుంటాడో చూడాలి.


Share

Related posts

Today Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..!!

bharani jella

‘సిఎంకు ఆ నివేదిక పంపాం’

sarath

ఎల్జీ పాలిమర్స్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

somaraju sharma