బిగ్ బాస్ రియాలిటీ షో ముగిసి రెండు వారాలకు పైనే అవుతున్నా దాని ఎఫెక్ట్ మాత్రం హౌస్మేట్స్ పై ఇంకా ఉంది. నాలుగో సీజన్ లో ఎంతో మంది హీరోలు గా బయటకు వచ్చారు. ఊహించని విధంగా భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. వారిలో ముఖ్యంగా సయ్యద్ సోహెల్ ర్యాన్ పేరు చెప్పుకోవాలి. ఇటీవల ముగిసిన నాలుగవ సీజన్ ద్వారా ఎంతో క్రేజ్ అందుకున్న అతను తాజాగా ఒక బంపర్ ఆఫర్ పట్టేసినట్లు తెలుస్తుంది.
ఇంట్లో ఉన్నంతసేపు కథ వేరేలా ఉంటుంది అనే డైలాగ్ తో పాపులర్ అయిన సోహెల్ ఫిజికల్ టాస్క్ లు, భావోద్వేగాలతో అందరిని మెప్పించాడు. ఇదే సమయంలో హీరోగా ఒక సినిమా కూడా ఓకే చేసుకున్నాడు. అలాగే రన్నరప్ కాకుండానే 25 లక్షల ఆఫర్ పట్టేసి మరింత మేలు పొందాడు. ప్రస్తుతం ‘జార్జిరెడ్డి’ టీం తో సినిమా చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం దీనికి సంబంధించిన ప్రకటన కూడా విడుదల అయిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో అతనికి మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయని అర్థం అవుతోంది. ప్రముఖ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ తో సోహెల్ దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ లో అతడు నటించబోతున్నాడు అని ఫిలింనగర్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అంతే కాకుండా మరికొన్ని చిన్న చిత్రాల్లో కూడా హీరోగా కనిపించనున్నాడని… పెద్ద చిత్రాల్లో కీలక పాత్రల కోసం అడుగుతున్నారని బయట విపరీతమైన టాక్ వస్తోంది. వీటిలో సగం నిజం అయినా చాలు సోహెల్ లైఫ్ సెట్ అయిపోయినట్లే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!