Sreemukhi: టెలివిజన్ రంగంలో తెలుగులో టాప్ యాంకర్లలో ముందువరుసలో శ్రీముఖి కి మంచి స్థానం ఉంది. బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి చేసే యాంకరింగ్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా శ్రీముఖి బీభత్సమైన ఫాలోయింగ్. ఇక ఇదే తరుణంలో బిగ్ బాస్ సీజన్ 3లో రాణించడంతో పాటు రన్నరప్ గా శ్రీముఖి గెలవడం జరిగింది. అంతమాత్రమే కాకుండా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు యాంకరింగ్ చేస్తూ మరో పక్క సినిమారంగంలో కూడా అడపాదడపా రాణిస్తోంది.
ఇక ఇదే రీతిలో బుల్లి తెర పై పలు షోలలో కూడా.. యాంకరింగ్ చేస్తూ.. ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తోంది. ముఖ్యంగా యాంకర్ ప్రదీప్ తో శ్రీముఖి చేసే షో టెలివిజన్ రంగంలో టిఆర్పి రేటింగ్ లో చాలా టాప్ లో ఉంటుంది. ఈ ఇద్దరు టాప్ యాంకర్లు.. సినిమా రంగంలో మరో పక్క టీవీ రంగంలో రాణిస్తూ ఉండగా వీరిద్దరి మధ్య సంథింగ్ ఉందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. ప్రారంభంలోనే యాంకర్ శ్రీముఖి.. ప్రదీప్ తో కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది.
Read more: Sreemukhi: లైవ్ లోనే ఫోన్ నెంబర్ ఇచ్చేసిన శ్రీముఖి..!!
దీంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం మాత్రమే కాక అంతకుమించి అన్నట్లు అప్పట్లో టాక్ వచ్చింది. అదే రీతిలో బిగ్ బాస్ హౌస్ లో తన లవ్ స్టోరీ గురించి.. యాంకర్ శ్రీముఖి చెప్పిన టైం లో.. అప్పట్లో అంతా ప్రదీప్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు భావించారు. అయితే వస్తున్న ఊహాగానాలు అప్పట్లో వస్తున్న వార్తలకు ఇద్దరి మధ్య.. ఏమీ లేదని ఇద్దరు క్లారిటీ ఇవ్వడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా తాజాగా అందరిముందు శ్రీముఖి… యాంకర్ ప్రదీప్ పై తన ఇష్టాన్ని బయటపెట్టేసింది. షో లో అందరు చూస్తుండగానే.. ప్రదీప్ కి ఐ లవ్ యు ప్రపోజ్ చేసింది. అందాలలో అహో మహోదయం అనే సాంగ్ వచ్చిన టైంలో ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి సిగ్గుపడుతూ.. ప్రదీప్ కి ఐ లవ్ యు చెప్పిన ప్రోమో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీముఖి ఐ లవ్ యు చెప్పిన అనంతరం ప్రదీప్ కూడా సిగ్గుపడుతూ.. ఉండటంతో సోషల్ మీడియాలో వీరిద్దరి జంట ఇప్పుడు వీడియో టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉంది.