NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ ఎన్నిక‌ల బ‌రిలో విచిత్రం… ఐదుగురు మాజీ సీఎంల కొడుకులు పోటీ..!

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చేసింది. ఇక ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు ప్ర‌చార యుద్ధం మామూలుగా ఉండ‌దు. ఇటు అధికార వైసీపీ.. అటు ప్ర‌తిప‌క్ష టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన కూట‌మి హోరా హోరీగా ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్ల తో పాటు 25 పార్ల‌మెంటు సీట్లు ఉన్నాయి. అయితే ఈ సారి ఎన్నిక‌ల్లో చాలా చిత్ర విచిత్రాలు ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చోటు చేసుకుంటున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లోనే భార్య భ‌ర్త‌లు ఇద్ద‌రూ వేర్వేరు పార్టీల త‌ర‌పున పోటీ చేసిన సంఘ‌ట‌న‌లు ఉన్నాయి. 2019 ఎన్నిక‌ల్లో భార్య భ‌ర్త‌లు అయిన కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి బీజేపీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేశారు. పురందేశ్వ‌రి భ‌ర్త అయిన ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు బాప‌ట్ల జిల్లా ప‌రుచూరు నుంచి అసెంబ్లీకి వైసీపీ త‌ర‌పున పోటీ చేశారు. అయితే ఈ ఎన్నిక‌ల్లో ఈ ఇద్ద‌రూ కూడా ఓడిపోయారు.

అయితే ఈ సారి ఏపి ఎన్నిక‌ల్లో ఏకంగా ఐదుగురు మాజీ సీఎంల త‌న‌యులు పోటీ చేస్తున్నారు. ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి వైసీపీ అధినేత వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రోసారి త‌న కంచుకోట అయిన పులివెందుల నుంచే పోటీ చేయ‌నున్నారు. ఇక మ‌రో మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ మంగ‌ళ‌గిరి నుంచి అసెంబ్లీ రేసులో ఉంటున్నారు. లోకేష్ గ‌త ఎన్నిక‌ల్లో ఇదే మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే.

ఇక టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు, మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ హిందూపురం నుంచే పోటీ చేస్తున్నారు. ఆయ‌న గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ హిందూపురం నుంచే పోటీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు బాల‌య్య వ‌రుస‌గా మూడోసారి హిందూపురం బ‌రిలో ఉన్నారు. ఇక మ‌రో మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర‌రావు త‌న‌యుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ తెనాలి నుంచి పోటీ ప‌డుతున్నారు.

ఆయ‌న గ‌తంలో రెండుసార్లు తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ప‌ని చేయ‌డంతో పాటు స్పీక‌ర్ గా కూడా ప‌నిచేశారు. ఇప్పుడు జ‌న‌సేన నుంచి అక్క‌డ నాలుగోసారి పోటీ చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ మ‌నోహ‌ర్ తెనాలి నుంచి జ‌నసేన అభ్య‌ర్థిగానే పోటీ చేశారు. ఇక మ‌రో మాజీ ముఖ్య‌మంత్రి అయిన కోట్ల విజ‌య్ భాస్క‌ర్ రెడ్డి త‌న‌యుడు కోట్ల సూర్య ప్ర‌కాశ్ రెడ్డి ఈ సారి టీడీపీ నుంచి డోన్ అసెంబ్లీకి త‌న అదృష్టం ప‌రీక్షించుకుంటున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న టీడీపీ నుంచి క‌ర్నూలు పార్ల‌మెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి డోన్ నుంచి అసెంబ్లీ బ‌రిలో ఉంటున్నారు. ఇలా ఈ ఎన్నిక‌ల్లో ఏకంగా ఐదుగురు మాజీ ముఖ్య‌మంత్రుల కుమారులు పోటీ చేస్తున్నారు. వీరిలో జ‌గ‌న్‌, బాల‌య్య‌, లోకేష్‌, కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌, మ‌నోహ‌ర్ అంద‌రూ కూడా అసెంబ్లీ కే పోటీ చేస్తుండ‌డం విశేషం. అయితే ఎన్టీఆర్ కుమార్తె ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి మాత్రం రాజ‌మండ్రి నుంచి బీజేపీ త‌ర‌పున పార్ల‌మెంటుకు పోటీ చేస్తున్నారు.

Related posts

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju