Sridevi Soda Center: తను నటించే సినిమాల్లో వైవిధ్యం చూపుతూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సుధీర్ బాబు.. ఇటీవల మల్టీస్టారర్ మూవీ V తో ప్రేక్షకులను పలకరించిన సుధీర్.. ప్రస్తుతం శ్రీదేవి సోడా సెంటర్ సినిమా లో నటిస్తున్నారు.. ఇటివల ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకర్షించింది.. ఈరోజు సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా శ్రీదేవి సోడా సెంటర్ ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు..

ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్న సుధీర్ బాబు.. “మరి అక్కడుంది లైటింగ్ సూరిబాబు కదా.. కొంచెం ఓల్టేజ్ ఎక్కువే ఉంటది..” అని కామెంట్ చేశారు. ఈ సినిమాలో కండలు తిరిగిన దేహంతో ఆకట్టుకున్నారు సుదీర్ బాబు. ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కుతోందని వీడియో ద్వారా చెప్పకనే చెప్పారు మేకర్స్. ఈ వీడియో విడుదలైన కాసేపట్లోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
పలాస 1978 సినిమాతో అరంగేట్రంలోనే మంచి పేరు సంపాదించుకున్న కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 4 గా నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో లైటింగ్ మెన్ సూరి బాబు పాత్రలు సుధీర్ బాబు కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.