ఘట్టమనేని ఫ్యామిలీలో సూపర్ స్టార్ కృష్ణ తర్వాత మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ బాబు కి విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో సుధీర్ బాబు. మహేష్ బాబు , సుధీర్ బాబు బావ మరిది అన్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి చాలా సినిమాలు చేశారు. కాని మహేష్ బాబు , సుధీర్ బాబు కలిసి ఒక్క సినిమాలో చేయలేదు. అదే కోరిక ప్రేక్షకుల్లో ఇప్పుడు బలంగా ఉంది.
ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని మహేష్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సుధీర్ బాబు కి అదే ప్రశ్న ఎదురైంది. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా నటించిన సినిమా ‘ వి ‘. శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా మరో నాలుగురోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా హీరో, హీరోయిన్స్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సుధీర్ బాబు ని మహేష్ బాబు తో కలిసి సినిమా చేస్తారా .. అది కూడా మహేష్ కి విలన్ గా అని అడిగారు. దానికి సుధీర్ బాబు వెంటనే ‘ఎస్’ అని సమాధానం చెప్పాడు. పోటా పోటీగా ఉండే పాత్ర చేయాలని ఉందంటూ వెల్లడించాడు. అలా కుదరకపోయినా మహేష్ పక్కన రెండు మూడు సీన్స్ ఉన్న చిన్న పాత్ర దొరికినా చాలని చెప్పుకొచ్చాడు. దాంతో అందరూ త్వరలో ఈ ఇద్దరిని కలిసి ఒకే ఫ్రేం లో చూడబోతున్నామని ఫిక్స్ అయ్యారు. అది పెద్ద విషయం కూడా కాదు. మహేష్ బాబు తలుచుకోవాలే గాని మంచి క్యారెక్టర్ ఉంటే దర్శక, నిర్మాతలని అడిగి మరీ సుధీర్ బాబు ని తీసుకుంటాడు.