బాలీవుడ్ హీరోని ఫిక్స్ చేసుకున్న పూరి.. వాళ్ళకి ఇక మామూలుగా ఉండదంతే ..!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒక సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ కి పూరి తో సినిమా చేయడం ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ ఇప్పుడు నెరవేరబోతుంది. ఇక ఈ సినిమాకి ఫైటర్ అన్న టైటిల్ ని పూరి ఫిక్స్ చేసుకోవాలనుకున్నాడు. కాని బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ సహ నిర్మాతగా వూవహరిస్తుండటంతో పాటు ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతుండటంతో యూనివర్సల్ టైటిల్ పెట్టాలని భావిస్తున్నారు.

Ananya Panday to star opposite Vijay Devarakonda in Puri Jagannadh's next-  The New Indian Express

ఇక పూరి అమితాబ్ తో గతంలో బుడ్డా హోగా తేరే బ్యాప్ తర్వాత నేరుగా తీస్తున్న సినిమా ఇదే. కాగా విజయ్ బాలీవుడ్ ఎంట్రీ మాత్రం గ్రాండ్ గానే జరుగుతోంది. ఈ సినిమాని పూరీ, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు పాన్ ఇండియా కేటగిరీలో రూపొందుతుండటంతో ఇప్పటికే సినిమాలోని మెజారిటీ పార్టీ ముంబైలోనే చిత్రీకరించారు. ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా.. తాజాగా ఈ ప్రాజెక్ట్ లో సీనియర్ బాలీవుడ్ స్టార్ హీరో నటించబోతున్నట్టు తెలుస్తుంది.

Sunil Shetty Net Worth 2020 - The Popular Bollywood Actor - Hi Boox

బాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలలో సునీల్ శెట్టి కి విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు పూరి – విజయ్ సినిమాలో కీలక పాత్ర కోసం సునీల్ శెట్టి ని తీసుకున్నారట. ఫ్లాష్ బ్యాక్ లో విజయ్ దేవరకొండ కి తండ్రిగా సునీల్ శెట్టి కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో సునీల్ శెట్టి కనిపించేది చాలా తక్కువ సేపే అయినప్పటికి చాలా పవర్ ఫుల్ గా ఆ పాత్ర ఉండనుందని సమాచారం. త్వరలో ఇందుకు సమంధించిన అఫీషియల్ న్యూస్ మేకర్స్ నుంచి రానుందని తెలుస్తుంది. ఇక చాలాకాలం తర్వాత పూరి ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ కొట్టి కం బ్యాక్ అయిన సంగతి తెలిసిందే.