ధైర్యం చేస్తున్న తెలుగమ్మాయిలు.. అలాంటి పాత్రలైనా ఒకే అంటున్నారు ..!

తెలుగు లోగిళ్ల నుంచి సినిమాల్లోకి ఒక అమ్మాయి వెళ్లడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అలా వెళ్లిగా పద్దతైన పాత్రలే చేశేవారు. గ్లామర్స్ పాత్రలకు తెలుగు అమ్మాయిలు ఆమడంత దూరంగా ఉండేవారు. కానీ కాలం మారుతోంది. తమ కలలను నెరవేర్చుకునేందుకు సినీరంగంలోకి తెలుగమ్మాయిలు మెళ్లి మెళ్లిగా అడుగులు వేస్తున్నారు. గ్లామరస్‌ పాత్రల్లో కూడా నటించేందుకు సిద్ధమవుతున్నారు. తమ టాలెంట్‌ను చూపించి…ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నారు. అలాంటి వారిలో కలర్‌ఫోటో హీరోయిన్ చాందిని చౌదరి ఒకరు.

Howrah Bridge Full Movie - 2018 Telugu Full Movies - Rahul Ravindran,  Chandini Chowdary - YouTube

మొదట షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించి పాపులర్ అయిన చాందిని తన అదృష్ట రేఖను పరీక్షించుకునేందుకు ఐదేళ్ల క్రితమే తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. కుందనపుబొమ్మ, మను, హౌరాబ్రిడ్జ్ వంటి సినిమాల్లో నటించింది. కాని అంతగా కలిసిరాకపోవడంతో చాందినికి ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఇంత మంచి నటికి మంచి హిట్ పడితే బాగుంటుందని..ప్రేక్షకులు కోరుకున్నారు. తాజాగా ఓటీటీలో రిలీజ్ అయిన కలర్‌ఫోటో చిత్రంతో అమ్మడి ఫేట్ మారిందనే చెప్పాలి.

Color Photo Teaser: All about Love and Friendship - Telugu Film News

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. ఈ సినిమాలో చాందిని చేసిన దీప్తి క్యారెక్టర్ ఆడియెన్స్‌కు బాగా రీచ్ అయ్యింది. విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది చాందిని. లేటెస్ట్‌గా ఓటీటీ వేదికగా బొంబాట్‌ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా మీడియాతో సినీ విషయాలను పంచుకుంది చాందిని. మను సినిమా నుంచి పాత్రలు, సినిమాలు ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. తెలుగు పరిశ్రమలో తనకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదని ..చాలా సార్లు ఎన్నో అవకాశాలను చేజారిన సందర్భాలు కూడా ఉన్నాయని ఓపెన్ అయింది.

Bombhaat | Song - Swami Natha (Lyrical) | Telugu Video Songs - Times of  India

తెలుగమ్మాయిలు అన్ని రకాల పాత్రలు చేయలేరని.. ముఖ్యంగా గ్లామర్స్ రోల్స్‌కి పనికిరారని..వారికి కొన్ని పరిమితులు ఉంటాయని దర్శకనిర్మాతలు అపోహ పడుతుంటారని వెల్లడించింది. అయితే ఇది ఎంత మాత్రం వాస్తవం కాదంటోంది చాందిని. ఇప్పుడు టాలీవుడ్ కి పరిచయమవుతున్న తెలుగు అమ్మాయిలు..అందంతో పాటు అభినయంలోనూ.. ఏ రకంగా కూడా ముంబై హీరోయిన్లకు తీసిపోరని చెప్పుకొచ్చింది. ఏ క్యారెక్టర్ అయినా..పోషించడానికి సిద్ధంగా ఉంటున్నారని చాందిని తెలిపింది. కథ డిమాండ్ చేస్తే ఏ రోల్ చేయడానికైనా తాను రెడీ అంటోంది చాందిని.
కలర్ ఫోటో హిట్‌ తరువాత ప్రస్తుతం చాందిని మూడు సినిమాల్లో నడిస్తోంది.