Thaman: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో తమన్ హవా కొనసాగుతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గత ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “అలా వైకుంఠపురం లో” సినిమా తో భారీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అందుకున్న థమన్ .. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక భారీ ప్రాజెక్టులు అవకాశాలు అందుకున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” తో స్టార్ట్ చేసి..పవన్- రానా మల్టీస్టారర్ సినిమా మాత్రమే కాక మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమా ప్రాజెక్టులకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే అతిపెద్ద మరో కీలక ప్రాజెక్ట్ కి మ్యూజిక్ అందించడానికి తమన్ రెడీ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
పూర్తి విషయంలోకి వెళ్తే సూపర్ స్టార్ మహేష్ తో త్వరలో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నట్లు వార్తలు ఇటీవల వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఓకే అయినట్లు లేటెస్ట్ టాక్. ఇప్పటికే మహేష్ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ రెడీ చేసినట్లు అంతే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నాడు మే 31 వ తారీకు .. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు ఫిలిం వర్గాలు చెబుతున్నాయి.
గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్.. అతడు, ఖలేజా సినిమాలు చేయడం జరిగింది. ఆ రెండు సినిమాలు మహేష్ కెరీర్ ని టర్నింగ్ పాయింట్ చేసే విధంగా మార్చాయి. ఒక విధంగా చెప్పాలంటే మహేష్ లో కొత్త నటుడిని.. బయటికి తీసాయి అని అంటుంటారు. ఈ తరుణంలో త్రివిక్రమ్ తో మహేష్ మూడో సినిమా చేయటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు రావడంతో పాటు వరుస విజయాల మీద ఉన్న థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవ్వటంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!